హీరోయిన్ చెట్టు..కొండలు..నదుల్ని కొలుస్తుందా?
ఇందులో తాను పోషిస్తున్న పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఆమె మాటల్లోనే 'నేను హిల్ స్టేషన్(కూర్గ్) నుంచి వచ్చాను.
పురాతన నాగరికతలో రాజులు..రాజ్యవంశాలెన్నో ప్రకృతినే ఆరాధించేవారు. భూమి..ఆకాశం..గాలి..నీరు దైవ సమానంగా భావించి పూజించేవారు. వాటిని ఆరాధ్యదైవంగా కొలిచేవారు. పంచభూతలా పరమావదిగా భావించేవారు. కాల క్రమంలో వాటి కొలమానంలో ఎన్నో మార్పులొచ్చాయి. నాగరికత వృద్దిలోకి వస్తోన్న కొద్ది ఈరకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దైవరూపంలో కొత్త రూపాలు తెరైకి వచ్చాయి.
అయితే కన్నడ బ్యూటీ వర్ష బొల్లమ్మ మాత్రం తాము కొలిచే ఆరాధ్యదైవం పంచభూతలే అంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సందీప్ కిషన్ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో తాను పోషిస్తున్న పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఆమె మాటల్లోనే 'నేను హిల్ స్టేషన్(కూర్గ్) నుంచి వచ్చాను. ప్రకృతి మా జీవితంలో ఒక భాగం. నిజ జీవితంలో కూడా మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులని ఆరాధిస్తాం.
ఆరకంగా భూమి పాత్ర నేను రిలేట్ చేసుకునే విధంగా వుంది. నా పాత్ర పేరు కూడా భూమిగా పెట్టారు అంటే? ఆ పాత్రతో ప్రకృతి రిలేషన్ ఎలా ఉంటుందో అంచనా వేయోచ్చు. ఈ కథ రాస్తున్నప్పుడే భూమి పాత్రకు నా పేరు రాసుకున్నట్లు దర్శకుడు చెప్పారు. అప్పుడు మరింత ఆనందం కలిగింది. ఆ పాత్రను నేను పోషించగలను అని ఆనంద్ ఎంత బలంగా నమ్మోరో అర్దమైంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని నేను నా వంతు ప్రయత్నం చేసాను. శక్తివంచన లేకుండా పనిచేసాను.
సందీప్ కిషన్ మంచి సహ నటుడు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో డిఫరెంట్ జానర్ చిత్రాలు చేసారు. ఆయనతో తెరను పంచుకోవడం మచి అనుభవాన్ని ఇచ్చింది. నేను నిడివి తక్కువగా ఉన్నప్పటికీ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలని చేయడానికే ఆసక్తిని చూపిస్తాను. ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రలన్నీ అలా వచ్చినవే. తెలుగు.తమిళం..మలయాళం భాషల్లో ఇప్పటివరకూ సినిమాలు చేసా. త్వరలో కన్నడలోనూ పరిచయం అవుతున్నా. అలాగే తెలుగులో మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని గురించి నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు' అని అంది.