భర్త, అత్తమామలతో లావణ్య తొలి దివాలీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడిన తర్వాత లావణ్య త్రిపాఠి బయట పెద్దగా కనిపించడం లేదు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడిన తర్వాత లావణ్య త్రిపాఠి బయట పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాకి సైతం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. అవసరమైతే? తప్ప అక్కడా అందుబాటులో ఉండటం లేదు. మెగా ఇంట కోడలైనా లావణ్యకి కావాల్సినంత స్వేచ్ఛ ఉన్నా? ఆ ఛాన్స్ తీసుకోవడంలో లేదు. భర్త, భర్త కుటుంబం అన్నట్లే లావణ్య ప్రయాణం సాగిస్తున్నారు.
తాజాగా వరుణ్ తేజ్ ని పెళ్లాడిన తర్వాత తొలి దీపావళి అత్తమామలు, ఆడపడుచుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకు న్నట్లు తెలుస్తోంది. తాజాగా నిహారిక ఫ్యామిలీ ఫోటోని అభిమానులతో పంచుకుంది. నాగబాబు దంపతులు...వరుణ్ దంపతులతో కలిసి దిగిన పిక్ ఇది. నిహారిక తెలుపు రంగు చీరలో మెరవగా, లావణ్య ట్రెడీషనల్ దుస్తుల్లో మెరి సింది. వరుణ్ తేజ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ షర్ట్ ప్యాంట్ ధరించాడు. పోనీటైల్ హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నాడు.
మరో పిక్ లో నవదంపతులిద్దర్ని చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు సంప్రదాయ పండగుల్ని హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకోవడం అంటే లావణ్యకి ఎంతో ఇష్టం. పెళ్లైన దగ్గర నుంచి ఆ వేడుకలకు మరింత దగ్గరైంది. వరుణ్ సహా అత్తమామల్ని ఇక్కడ సంప్రదాయాల్ని అడిగి మరి తెలుసు కుని జరుపుతుంది. లావణ్య సినిమాల విషయానికొస్తే వాటికి దూరంగానే కనిపిస్తుంది. ఫ్యామిలీ లైఫ్ లోనే బిజీగా గడుపుతుంది.
వరుణ్ తేజ్ మాత్రం త్వరలో `మట్కా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వరుణ్ కెరీర్ లో తొలి భారీ బడ్జెట్ చిత్రమిది. షూటింగ్ అంతా సెట్స్ లోనే చేసారు. 1970-80 బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేసారు.