మెగాఫ్యామిలీ ఇంట పెళ్లి పనులు షురూ!
తాజాగా ఈ కథనాల్ని బలపరుస్తూ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలో ముంబైలోని ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ లో జంటగా కనిపించారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్దం ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకూ పెళ్లికి ముహూర్తం పెట్టలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో వివాహం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి అంత సమయం లేదని ఆగస్ట్ కి ప్రీ పోన్ చేసినట్లు వార్తలొచ్చా యి. అయితే ఆగస్టు పోయింది. కానీ ఇంకా పెళ్లి జరగలేదు. మరి పెళ్లి ఎప్పుడు? అంటే తాజాగా నవంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వినిపిస్తోంది. ఆ నెలలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
అటుపై హైదరాబాద్ కి తిరిగొచ్చిన తర్వాత భారీ ఎత్తున రిసెప్సన్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం మెగా ఫ్యామిలీ ఫిక్సై పోయి అప్పుడే పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు వినిపిస్తోంది. మెగా ఇంట్లో పెళ్లి వాతావరణం కనిపిస్తుందని లీకులందుతున్నాయి.
తాజాగా ఈ కథనాల్ని బలపరుస్తూ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలో ముంబైలోని ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ లో జంటగా కనిపించారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పెళ్లి షాపింగ్ లో భాగంగా నే కాబోయే దంపుతులు ఇలా షాపింగ్ కి వచ్చారని తెలుస్తోంది. పెళ్లికి అవసరమైన డిజైనర్ దుస్తులన్నింటిని ఇందులో కొనుగోలు చేసే పనిలో భాగంగా ఇరువురు కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.
వెనుక పెద్దలు ఎవ్వరూ లేరు. లావణ్య-వరుణ్ మాత్రమే తమకు కావాల్సిన విధంగా షాపింగ్ చేసుకునేందుకు జంటగా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లి తేదీ దగ్గర పడిందనే ప్రచారం ఠారెత్తుతుంది.
ముహూర్తాలు పెట్టేసారని..కాకపోతే ఆవిషయాన్ని మెగా ఫ్యామిలీ రివీల్ చేయలేనది భావిస్తున్నారు. మరి గట్టి మేళం తేదీ ఎప్పుడు రివీల్ చేస్తారో చూద్దాం. ఇటీవలే వరుణ్ నటించిన 'గాండీవధారి అర్జున' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్'..'మట్కా' చిత్రాల్లో నటిస్తున్నారు. లావణ్య మాత్రం ఒక్క తమిళ్ చిత్రం మినహా కొత్త ప్రాజెక్ట్ లు ఏవి కమిట్ అవ్వలేదు.