వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
మెగా వారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా ఇటలీలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
మెగా వారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా ఇటలీలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మెగా వారుసల తొలి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇదే. ఇంతకు ముందు మెగా వారసుల్లో ఎవరి పెళ్లి ఇలా జరగలేదు. కానీ వరుణ్ పెళ్లిని సంథింగ్ స్పెషల్ గా భావించి ఇటలీలో పెళ్లి జరిపించారు. ఇది కుటుంబ సభ్యుల నిర్ణయమా? వరుణ్ -లావణ్య ల ఇష్టప్రకారం జరిగిందా? అన్నది పక్కనబెడితే పెళ్లి మాత్రం ఇటలీలో జరిగినా హైదరాబాద్ లో జరిగినట్లే ఘనంగా జరిగింది.
సంప్రదాయ తెలుగు కట్టుబాట్లు ప్రకారం వివాహం జరిగింది. ఇటలీలోని టుస్కానీలో ఉన్న లగ్జరియస్ బోర్గా సాన్ ఫెలిస్ రిసార్ట్లో ఎంతో వైభవంగా జరిగిందీ వేడుక. వేడుకలో పాల్గొంది కేవలం కుటుంబ సభ్యులు..ముఖ్యమైన వారు తప్ప ఇంకెవరు కనిపించలేదు. అందులోనూ ఎక్కువగా మెగా కుటుంబానికి చెందిన వారే కనిపించారు. లావణ్య తరుపున కేవలం తల్లిదండ్రులు తోబుట్లువులు వీళ్లే కనిపించారు.
మరి ఈ వివాహానికి ఎంత ఖర్చు అయింది? మెగా ఫ్యామిలీ అందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేసింది? అన్నది ఆసక్తికరం. ఇటలీల ఖరీదైన సుందరమైన నగరం. ప్లైట్ ఛార్జీల నుంచి రిస్టార్స్ట్ ఛార్జీల వరకూ భారీగానే ఉంటుంది. అక్కడే కాక్ టెయిల్ పార్టీలు..అవసరమైన అన్నిరకాల సౌకర్యాల్ని అదే రిస్టార్స్ట్ లో ఏర్పాటు చేసుకున్నారు. పెళ్లి వారం రోజులు ముందుగానే వరుణ్-లావణ్య-నిహారిక ఇటలీ చేరుకున్నారు.
అవసరమైన మొదొస్తు షాపింగ్ చేసారు. ఇంకా చరణ్-ఉపాసనలు కూడా ముందుగానే వెళ్లారు. అటుపై కుటుంబ సభ్యులు పెళ్లికి రెండు రోజుల ముందుగా చేరుకున్నారు. ఆ తర్వాత హల్దీ వేడుకలు..సంగీత్ మొంహదీ ఈవెంట్లు జరిగాయి. ఈ మొత్తం ఖర్చు కోట్లలో ఉంటుందని ఓ అంచనా. హైదరాబాద్ లో వివాహం జరిగినా ఖర్చు కానంత ఫిగర్ డెస్టినేషన్ వెడ్డింగ్ అయినట్లు ప్రచారం సాగుతోంది కానీ అందులో వాస్తవం లేదని వినిపిస్తుంది. మరి అసలు లెక్క? ఎంత అన్నది తెలియాల్సి ఉంది