వరుణ్ తేజ్.. మొత్తానికి మొదటి స్టెప్ సక్సెస్

ఈ రోజుల్లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే మొదట టీజర్, ట్రైలర్‌ లే కీలకం అవుతున్నాయి

Update: 2024-10-07 06:30 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో వరుసగా కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు తన తాజా సినిమా 'మట్కా' టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ రోజుల్లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే మొదట టీజర్, ట్రైలర్‌ లే కీలకం అవుతున్నాయి. టీజర్‌ రక్తికట్టకపోతే సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమైపోతుంది.

అదే, 3 నిమిషాల ట్రైలర్‌ ఆకట్టుకుంటే, ఆ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్‌ క్యారెక్టర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. గతంలో వచ్చిన గని, గాందీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు దారుణమైన నష్టాలను కలిగించాయి. ఆ సినిమాల ట్రైలర్‌ లను గమనిస్తే, వరుణ్‌ తేజ్‌ సాలిడ్‌ హీరోగా నిలదొక్కుకున్నప్పటికీ, బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి.

ఆ చిత్రాలకు సంబంధించిన ట్రైలర్‌లు పెద్దగా ఎమోషనల్‌ కిక్‌ ఇవ్వకపోవడం వల్ల ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించలేదనే చెప్పాలి. అయితే, ఇప్పుడు వరుణ్ తేజ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'మట్కా' టీజర్‌ చూసిన ప్రతీ ఒక్కరు వరుణ్‌ తేజ్‌ లో కొత్త వేరియేషన్‌ను గమనిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ తన పాత్రలో వయసు పెరుగుతున్నా అనుభవం తెస్తూ, తన పాత్రను రొమాంటిక్‌, సీరియస్‌గా ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారు.

మట్కా సినిమాలోని పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఎలాంటి వెరీయేషన్స్ చూపించనున్నారో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కరుణ కుమార్‌ను కూడా ఇంత క్లాసీగా, స్టైలిష్‌గా షాట్స్‌ను డిజైన్‌ చేస్తారని అనుకోలేదు. టీజర్‌లో ఉన్న విజువల్స్, అందులోని ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి.

గత మూడు ఫ్లాప్స్‌ తర్వాత వరుణ్‌ తేజ్‌ నుండి వచ్చిన మట్కా టీజర్‌ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌ కనిపిస్తున్నాయి. సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధిస్తుందనే ఆశతో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్‌ విడుదలైతే మరింత హైప్‌ క్రియేట్‌ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ పాత్రలో ఉన్న విభిన్నత, అద్భుతమైన ఫీల్‌ మేకింగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతుండటం విశేషం.

Full View
Tags:    

Similar News