దేవరకొండ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు

దీంతో ఖుషి చిత్రాన్ని హిందీలో ప్రమోట్ చేసే బాధ్యతలు విజయ్ దేవరకొండ తీసుకున్నారు. ప్రతి ఫ్యామిలీ, లవ్ డ్రామాలో ఉండే ఎమోషన్ ఖుషి చిత్రంలో ఉంది.

Update: 2023-08-16 04:42 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోన్న నేపథ్యంలో ఫేమ్ ఉన్న హీరోలు అందరూ తమ సినిమాలని కనీసం ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మార్కెట్ పెరగడంతో పాటు సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తే భారీ లాభాలు వస్తాయని భావిస్తున్నారు. పెట్టిన బడ్జెట్ కి రెట్టింపు లాభాలు రావాలంటే పాన్ ఇండియా కరెక్ట్ అని భావిస్తున్నారు.

లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో తన లక్ టెస్ట్ చేసుకున్నాడు. మూవీ కోసం చాలా గ్రాండ్ గా ప్రమోషన్ చేశాడు. ఆ సమయంలో నార్త్ లో తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందనే విషయాన్ని విజ్జయి దేవరకొండ గ్రహించాడు. తెలుగులో ఉన్నట్లే నార్త్ లో కూడా అభిమానులని అలరించాలని ఫిక్స్ అయిపోయి ప్రస్తుతం కంప్లీట్ చేసిన ఖుషి మూవీని హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఖుషి టైటిల్ సాంగ్ కి హిందీలో సూపర్ హిట్ టాక్ వచ్చింది. మిగిలిన సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. దీంతో ఖుషి చిత్రాన్ని హిందీలో ప్రమోట్ చేసే బాధ్యతలు విజయ్ దేవరకొండ తీసుకున్నారు. ప్రతి ఫ్యామిలీ, లవ్ డ్రామాలో ఉండే ఎమోషన్ ఖుషి చిత్రంలో ఉంది. అందుకే భాషతో సంబంధం లేకుండా అందరికి చేరువ అవుతుందని భావిస్తున్నాడు.

ఈ కారణంగానే ఖుషి చిత్రాన్ని హిందీలో మార్కెట్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. కొద్ది రోజులు ముంబై వెళ్లి అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు, కొన్ని స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా హిందీ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని భావిస్తున్నారు.

లైగర్ మూవీ డిజాస్టర్ అయిన కూడా హిందీలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో నార్త్ లో తనకు మంచి మార్కెట్ ఉందని విజయ్ భావిస్తున్నారు. దీనిని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలంటే ఖుషి సినిమాని నార్త్ లో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంత ఉందనేది కచ్చితంగా ప్రూవ్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News