AMB మైండ్ బ్లోయింగ్ : విజయ్ దేవరకొండ

అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ టీమ్.. బుధవారం సాయంత్రం విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి ఆయనను కలిసింది. హీరో సుహాస్ తోపాటు డైరెక్టర్ దుశ్యంత్, ప్రొడ్యూసర్ ధీరజ్, నటి శరణ్య, శివాని విజయ్ ఇంటికి వెళ్లారు.

Update: 2024-01-31 17:02 GMT

కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్. దుశ్యంత్ కటికినేని తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో బ్యూటీ శివానీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

తాజాగా టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమా బుకింగ్స్ ను ప్రారంభించి బిగ్ టికెట్ ను రిలీజ్ చేశారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ టీమ్.. బుధవారం సాయంత్రం విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి ఆయనను కలిసింది. హీరో సుహాస్ తోపాటు డైరెక్టర్ దుశ్యంత్, ప్రొడ్యూసర్ ధీరజ్, నటి శరణ్య, శివాని విజయ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సినిమా బుకింగ్స్ ప్రారంభించి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు విజయ్.

"ఫస్టాఫ్ అయితే పగిలిపోయిండే. మ్యూజిక్, నటన మరో లెవల్ లో ఉంది. ఫస్టాఫ్ తర్వాత లంచ్ చేద్దామని అనుకున్నా కానీ.. ఆ సినిమా నుంచి బయటకు రాలేకపోయాను. మూవీ గురించి మాట్లాడుతూ ఉండిపోయాను" అని AMB టీమ్ తో విజయ్ తెలిపారు. సినీ ప్రియులంతా ఈ చిత్రాన్ని చూడాలని కోరారు. విజయ్ కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలు భారీ పెరిగాయి.

"అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఓ మైండ్ బ్లోయింగ్ మూవీ. టీజర్ చూసే నేను ఆశ్చర్యపోయాను. సుహాస్ టాలెంట్ నాకు తెలుసు. అతడితో కలిసి డియర్ కామ్రేడ్ మూవీ చేశాను. అప్పుడు దుశ్యంత్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత అసలు దుశ్యంతేనా ఈ మూవీ తీసిందని అనిపించింది. ఫిబ్రవరి 2న ఓ స్పెషల్ సినిమా థియేటర్లలోకి వస్తుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. స్టోరీ టెల్లింగ్, నటన, మ్యూజిక్.. ఇలా అన్నింట్లోనూ ఇది స్పెషల్. ఈ సినిమాలో సుహాస్ అద్భుతంగా నటించాడు. శరణ్య, శివాని తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు" అని విజయ్ తెలిపారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందింది. మ‌నుషుల మ‌ధ్య అహం ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుందనే పాయింట్‌ తో ఈ మూవీ తెర‌కెక్కింది. మరోవైపు, ఈ వారం టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. దీంతో అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ కు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News