అక్కడ ముగింపు...ఇక్కడ ఆరంభం!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తె రకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తె రకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత అనీల్ మళ్లీ వెంకీలో రొమాంటిక్ హీరోని తట్టి లేపుతుప్పాడు. ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా హైలైట్ చేస్తున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు అన్న తరహా లోనే సినిమా ఉంటుందని ప్రచారంలో ఉంది. మాజీ ప్రేయసి, అందమైన భార్య మధ్య నలిగిపోయే హీరోగా వెంకటేష్ కనిపిస్తారని సమాచారం.
ఇదొక ట్రయాంగిల్ లవ్ కమ్ క్రైమ్ స్టోరీగా మలుస్తున్నాడు. నెల రోజలుగా రెండవ షెడ్యూల్ పొల్లాచ్చిలో జరుగుతోంది. తాజాగా ఆ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో రెండు పాటల చిత్రీకరణ సహా కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసారు. ఇందులో వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి సహా ప్రధాన తారగణ మంతా పొల్గొంది. పొల్లాచ్చిలో ముగ్గురి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమచారం.
సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే కొత్త షెడ్యూల్ ఇదే నెలలో హైదరాబాద్ లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించి పనుల్లో టీమ్ బిజీ అవుతుంది. ఇక రిలీజ్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలోనే రివీల్ చేసారు.
టైటిల్ గా కూడా రిలీజ్ కి సింక్ అయ్యేలా `సంక్రాంతికి వస్తున్నాం` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ గా అదే తెరపైకి వచ్చింది. ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ చాలా కాలం తర్వాత నటిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఇంతవరకూ అనీల్ తో వైఫల్యం కూడా ఎదురవ్వలేదు. చేసిన రెండు సినిమాలు `ఎఫ్ -2`, `ఎఫ్ -3` మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.