మేనల్లుడికి మేనమామ దిష్టి చుక్క అదిరిపోయిందే!
చైతన్య- శోభితలు ఎంతో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
కొత్త పెళ్లి కొడుకు నాగచైతన్య పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లికి హాజరైంది కొద్ది మందే అయినా? ఎంతో గ్రాండ్ గానే వేడుక జరిగింది. చైతన్య- శోభితలు ఎంతో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. తాజాగా నెట్టింట చైతన్య ఇంట్రెస్టింగ్ పిక్ ఒకటి హైలైట్ అవుతుంది.
ఓసారి ఆ పిక్ లోకి వెళ్తే... నాగచైతన్య పెళ్లి కొడుకుగా ముస్తాబవుతోన్న సందర్భం అది. ఈ సందర్భంగా మేనమామ వెంకటేష్ చైతన్య బుగ్గపై దిష్టి చుక్క పెడుతోన్న సన్నివేశం చూడొచ్చు. చైతన్య కుర్చిని ఉండగా..వెంకటేష్ వొంగుని చుక్క పెడుతున్నారు. ఈ సన్నివేశం ఎంతో చూడ ముచ్చటగా ఉంది. ఆ సమయంలో చైతన్య ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడు.
ఈ ఫోటోని వెంకటేష్ స్వయంగా తన ఇన్ స్టాఖాతాలో అభిమానులకు షేర్ చేసారు. సాధారణంగా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అన్నది చాలా రేర్. అలాంటిది స్వయంగా మేనమామగా తన బాధ్యతను నెర వేర్చినట్లు ఇలా చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
చైతన్య-వెంకటేష్ లను అలా చూసి అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. ఇద్దరు కలిసి `వెంకీ మామ` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులోనూ వెంకటేష్ మేనల్లుడి పాత్రలోనే చైతన్య నటించాడు. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2019లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి మళ్లీ కలిసి సినిమా చేయలేదు.