విమానంలో మిస్ బ్యూటీకి వెంకీ మామ స‌ల‌హా

మాజీ మిస్ ఇండియా కూడాను. హైద‌రాబాద్ లో ఏ బ్రాండ్ విల్లా కొనాలో కూడా సూచించ‌మ‌ని వెంకీని స‌ల‌హా అడిగింది.

Update: 2024-03-18 15:59 GMT

గాల్లో విమానం ఎగురుతోంది. విమానంలోంచి చూస్తే ఏరియ‌ల్ వ్యూలో న‌గ‌రం ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఆకాశ‌హార్మ్యాల న‌గ‌రంలో విలాసాల విల్లాలు, అపార్ట్ మెంట్ లు ఎంతో అందంగా గోచ‌రిస్తున్నాయి. వాటిని విమానంలోంచి చూశాక చెవులూర కుండా ఉంటాయా? వెంట‌నే కొనేయాల‌ని అనిపించ‌దూ.. ఆ అమ్మాయికి కూడా అదే అనిపించింది. ఏకంగా త‌న ఊరు వాడా వ‌దిలేసి ఏకంగా హైద‌రాబాద్ కి షిఫ్ట‌యిపోతాన‌ని చెప్పింది. అలా కోరుకున్న అమ్మాయి సామాన్యురాలేం కాదు. మాజీ మిస్ ఇండియా కూడాను. హైద‌రాబాద్ లో ఏ బ్రాండ్ విల్లా కొనాలో కూడా సూచించ‌మ‌ని వెంకీని స‌ల‌హా అడిగింది.

తాను అడ‌గాలే కానీ.. స‌ల‌హా ఇవ్వ‌కుండా ఉంటాడా వెంకీ మామ‌. అంద‌మైన అమ్మాయికి స‌ల‌హా ఇవ్వ‌క‌నే ఇచ్చేశాడు. ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కూడా సూచించాడు. అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ జోడీ బావుంది. టాలీవుడ్ నటుడు వెంకటేష్ ప్ర‌ముఖ రియాల్టీ కంపెనీతో క‌లిసి ప‌ని చేస్తున్నారు. కంపెనీ ప్ర‌మోష‌న్స్ కోసం కాంట్రాక్టును కుదుర్చుకున్నారు. కాచీగూడ, కొంపల్లిలో ఈ సంస్థ భారీ ప్రాజెక్టులు చేస్తోంది. ఇలా అగ్ర క‌థానాయ‌కుడు వెంక‌టేష్ .. యువ న‌టితో ప్రచార చిత్రాన్ని ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

ఈ ప్ర‌క‌ట‌న‌లో న‌టించిన అందాల మిస్సు ఎవ‌రు? అంటే.. మానస వారణాసి. ఈ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. వెంకటేష్ సర్ తో పనిచేయడం హ్యాపీగా ఆడుకున్నట్టు ఉంది అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క‌ట‌న వైర‌ల్ గా మారుతోంది.



Tags:    

Similar News