యాక్టింగ్ కి అందుకే గుడ్ బై చెప్పేసా!
యంగ్ మేకర్ వెంకీ అట్లూరి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవలే `లక్కీ భాస్కర్` తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.
యంగ్ మేకర్ వెంకీ అట్లూరి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవలే `లక్కీ భాస్కర్` తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు` సార్` అనే చిత్రంతోనూ విజయాన్ని అందుకున్నాడు. `తొలి ప్రేమ`తో దర్శకుడిగా మారిన వెంకీ అటు పై `మిస్టర్ మజ్ను`, `రంగ్ దే` లాంటి ప్లాప్ లు చూసాడు. మొత్తంగా ఇప్పటివరకూ చేసిన ఐదు సినిమాల్లో మూడు సక్సెస్ లు ఉండటంతో? వెంకీ కెరీర్ కి వచ్చిన ఇబ్బంది లేదు.
సక్సెస్ పుల్ గానే దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. అయితే వెంకీ డైరెక్టర్ కాక ముందే నటుడిగా కెరీర్ ప్రారంభిం చాడు. ` జ్ఞాపకం`, `స్నేహగీతం` చిత్రాల్లో నటించాడు. దీంతో వెంకీ ఇండస్ట్రీకి వచ్చింది నటుడు అవ్వడానికేనని ఓ క్లారిటీ ఉంది. అయితే అతడి టార్గెట్ నటుడు అవ్వడం కాదు..దర్శకుడు అవ్వాలన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. రచన-దర్శకత్వాన్ని తానెంత ఇష్టపడతాడు? అన్నది చెప్పకనే చెప్పాడు.
` నాకు నటనకంటే డైరెక్షన్ , రచన అంటేనే ఇష్టం. ఆ పనే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. నటుడిగా మ్యాకప్ వేసుకున్నప్పుడు ఏదో అసౌకర్యంగా ప్లాస్టిక్ బ్యాగ్ ముఖానికి కప్పేసుకున్నట్లు ఉంటుంది. అందుకే నటనను పూర్తిగా వదిలేసి దర్శకత్వం వైపు వచ్చాను. నేను ఇండస్ట్రీలో ఉండాలనుకున్నది కూడా దర్శకుడిగానే. అప్పుడు నటించిన సినిమాలేవో అలా నటించానంతే. లక్కీ భాస్కర్ కి సీక్వెల్ చేయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు బ్యాకింగ్ వ్యవస్థ డిజిటలైజ్ అయింది. లక్కీ భాస్కర్ లో నేను చెప్పింది వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. తాజా బ్యాంకింగ్ వ్యవస్థపై సినిమా చేయాలంతే చాలా విషయాలు తెలుసుకుని ఎనాలసిస్ చేయాలి. ప్రస్తుతానికి ఆ ఆలోచనైతే లేదు. భవిష్యత్ లో చూద్దాం` అని అన్నారు.