ఇదేం ట్విస్ట్ దానయ్య ...?
అయితే తాజాగా దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరికి షాకింగ్ గా మారాయి.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మాణంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ మూవీ గురించి ఆ మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. సౌత్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందబోతున్న సినిమాను దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
గత రెండు రోజుల నుంచి విజయ్ డిమాండ్ చేసిన భారీ పారితోషికంకు దానయ్య షాక్ అయ్యాడని, అంత పారితోషికం తన వల్ల కాదు అంటూ సినిమా నుంచి దానయ్య తప్పుకున్నాడు అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరికి షాకింగ్ గా మారాయి.
విజయ్ కోసం నా వద్ద ఒక కథ ఉన్న విషయం నిజమే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ సినిమా సాధ్యం కాదని అన్నాడు. వెట్రిమాన్ చాలా క్లియర్ గా విజయ్ తో సినిమా లేదు అంటూ ప్రకటించాడు. పైగా విజయ్ తో తన సినిమా అంటూ వచ్చిన వార్తలు అన్నీ కూడా పుకార్లే అంటూ తేల్చి పారేశాడు.
వెంట్రిమారన్ ను విజయ్ తో సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించగా.. పుకార్లు పుట్టించిన వారినే అడగాలి అన్నట్లుగా సమాధానం చెప్పాడు. ఇన్ని రోజులు దానయ్య బ్యానర్ లో విజయ్ మూవీ అంటూ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే ఇలా జరిగిందేంటి.. ఈ ట్విస్ట్ ఏంటో అంటూ నెటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అవ్వబోతున్నాడు. ఇటీవలే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ త్వరలో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ పార్టీ నిలవడం లేదు.