వేటయ్యన్ ఆన్ ఛార్జ్.. లైక్స్ అన్నీ ఆమెకే..!

వేటయ్యన్ సాంగ్ లో రెడ్ కలర్ శారీ కళ్లకి గాగుల్స్ తో మంజు వారియర్ స్టెప్పులతో అదరగొట్టేసింది.

Update: 2024-09-10 11:13 GMT

జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా వేటయ్యన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రజనీ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. రజిని, అనిరుద్ సూపర్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ఆడియన్స్ లో కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకు తగినట్టుగానే వేటయ్యన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా అది ఇన్ స్టంట్ గా ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. తలైవా రజినీ మీద తనకున్న ప్రేమ అభిమానం ను మరోసారి అనిరుద్ చూపించాడు.

ఐతే లేటేస్ట్ గా వేటయ్యన్ నుంచి రిలీజైన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అనిరుద్ క్యాచీ ట్యూన్ దానికి తగినట్టుగానే లిరిక్స్ అదిరిపోయాయి. సూపర్ స్టార్ సాంగ్ రిలీజ్ అనగానే ఫ్యాన్స్ అంతా అలర్ట్ అవుతారు. ఐతే వేటయ్యన్ తొలి సాంగ్ లో ఈసారి రజినీ కన్నా అందులో ఆయనకు జోడీగా చేసిన మంజు వారియర్. మలయాళంలో మంచి నటిగా పాపులారిటీ సంపాదించిన మంజు వారియర్ మలయాళం, తమిళ భాషల్లో నటిస్తూ వస్తున్నారు.

వేటయ్యన్ సాంగ్ లో రెడ్ కలర్ శారీ కళ్లకి గాగుల్స్ తో మంజు వారియర్ స్టెప్పులతో అదరగొట్టేసింది. అదిరిపోయే సాంగ్ అందుకు తగినట్టుగానే డ్యాన్స్ తో మంజు వారియర్ ఒక ఊపు ఊపేసింది. నటిగా దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమాలతో అలరిస్తున్న మంజు వారియర్ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది.

ఐతే వేటయ్యన్ సాంగ్ తో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్ లో నిలిచింది. వేటయ్యన్ గా రజినికాంత్ ఆన్ ఛార్జ్ తీసుకుంటే సాంగ్ లో లైక్స్ మాత్రం మంజు వారియర్ కి మాత్రమే వస్తున్నాయి. జై భీం డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. జైలర్ తో తిరిగి ఫాంలోకి వచ్చిన రజిని వేటయ్యన్ తో మరో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. సాంగ్ తోనే సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసిన అనిరుద్ జైలర్ కి ఇచ్చినట్టుగానే సినిమా బిజిఎం తో కూడా ఆడుకున్నాడని అనిపిస్తుంది. మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 10 దాకా వెయిట్ చేయాల్సిందే.

Full View
Tags:    

Similar News