పుష్ప రాజ్ దెబ్బ.. చేసేదేమి లేక డ్రాప్ అయ్యారుగా!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప-2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

Update: 2024-10-25 06:05 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప-2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఎదురుచూస్తున్నారు. మరోసారి స్క్రీన్ పై పుష్పరాజ్ స్వాగ్ ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సినిమాపై వేరే లెవెల్ లో అంచనాలు పెట్టుకున్నారు. వాటికి తగ్గట్లే డైరెక్టర్ సుకుమార్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ షూట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసింది. రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. వేరే లెవెల్ లో ఆకట్టుకున్నాయి. నవంబర్ లో మూవీ ట్రైలర్ తో పాటు మరో రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ నిన్ననే అనౌన్స్ చేశారు. అదే సమయంలో రిలీజ్ డేట్ ను ఒకరోజు ముందుకు తీసుకొచ్చారు. డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

అయితే పుష్ప-2 ఎన్నడూ లేనంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని మేకర్స్ నిన్న అంగీకరించారు. రూ.1000 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ను రూ.400 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఓటీటీ హక్కులను రూ.275 కోట్లకు నెట్ ఫిక్స్ దక్కించుకున్నట్లు టాక్. మొత్తానికి పుష్పపై ఉన్న క్రేజ్ చూస్తుంటే.. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం పక్కా అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే నమోదై ఉన్న అనేక రికార్డులు పుష్ప-2 బద్దలు కొడుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు.

అలాంటిది పుష్ప-2 పోటీగా ఏదైనా సినిమా రిలీజ్ చేయాలనుకునే బదులు.. సైలెంట్ గా ఉంటే బెటరేమో కదా! ఇప్పుడు ఛావా మేకర్స్ కూడా అదే చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్న ఆ సినిమాను ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. టీజర్ తప్ప మరో అప్డేట్ ఇవ్వలేదు.

ఇప్పుడు ఛావా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లో పుష్ప-2పై వేరే లెవల్ బజ్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీంతో బీటౌన్ లో పుష్ప ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉంటాయి. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే తిరుగులేదు. కాబట్టి ఛావాకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందింది కనుక.. వసూళ్లు కూడా అనుకున్నంత స్థాయిలో రావు. దీంతో ఛావా మేకర్స్.. వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని చూస్తున్నారు. అయితే పుష్ప, ఛావా సినిమాల్లో హీరోయిన్ రష్మికనే. మొత్తానికి పుష్పరాజ్ దెబ్బకు ముందే ఛావా మేకర్స్ డ్రాప్ అయిపోయారన్నమాట!

Tags:    

Similar News