మొదటిసారి బాగా బూతులు తిట్టేసి రచ్చ రచ్చ చేసిన ''అర్జున్ రెడ్డి'' ఇవాళ ట్రైలర్ తో ముందుకొచ్చాడు. మరి టీజర్లోనే అలా రచ్చ చేసిన కుర్రాడు.. ట్రైలర్ లో ఏం చేశాడు. నిజానికి.. బాగా స్లో అయ్యాడు. అంటే చాలా జాగ్రత్తపడ్డాడు. సెన్సార్ కు దొరక్కుండా సినిమాలోని ఒక కోణాన్ని బాగానే చూపించాడు దర్శకుడు సందీప్ రెడ్డి.
అర్జున్ రెడ్డికి యాంగర్ మేనేజ్మెంట్లో స్కోర్ సున్నా అని మనకు తెలిసిందే. అలా సున్నా వస్తే.. వాడు ఆపరేషన్లు చేసే కత్తి పట్టుకున్న ఒక మర్డరర్ అవుతాడు తప్పించి డాక్టర్ కాలేడు అంటారు లెక్చరర్లు. ఇది ఒక మెడికో కథ అని మనకు అర్దమవుతోంది. మనోడు తన జూనియర్ ఒకమ్మాయిని ప్రేమించడం.. ఆమెను ప్రేమించొద్దంటూ అందరికీ వార్నింగులు ఇవ్వడం.. ఆ తరువాత ఆమెను పొమ్మనడం.. రొటీన్ సీన్లే కాని.. రథన్ అందించి మ్యూజిక్ మరియు రాజ్ తోట సినిమాటోగ్రాఫి అదిరిపోయాయ్. అలాగే ఈ మొత్తం ట్రైలర్లో ఒక్క షాట్లో పాతతరం హీరోయిన్ కాంచన ను అలా చూస్తే మాత్రం ఎవ్వరికైనా గుండె జివ్ అంటుంది. అదరగొట్టే మ్యూజిక్ తో కొత్త దర్శకుడు ఏదో ఇంటెన్స్ గా చెబుదాం అనుకున్నాడని అర్దమవుతోంది.
ఈ మధ్యకాలంలో ఆల్టర్నేట్ ఫిలిం మేకింగ్ పేరుతో చాలామంది కొత్త కొత్త సినిమా నెరేటివ్ లు ఉండేలా ప్రయత్నిస్తున్నారు. మరి లైఫ్ లో ఏ సబ్జెక్ట్ అన్నా డీపుగా వెళితే మిగిలేది జీరో అంటూ అర్జున్ రెడ్డి కూడా అలా కొత్తగానే అడుగులు వేస్తున్నాడు. నిజమే.. సినిమా విషయంలో కూడా ప్రయోగం పేరుతో డీపుగా వెళితే జీరోగానే మిగులుతున్నాయి. మరి అర్జున్ రెడ్డి ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాడేమో చూద్దాం. ఆగస్టు 25న సినిమా విడుదలవుతోంది.
Full View