దేవిశ్రీప్రసాద్ కేవలం సంగీత దర్శకుడే కాదు, ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. అబ్బబ్బ దేవి ఏం ట్యూన్ ఇచ్చాడూ.. ఏం లిరిక్ రాశాడూ... అని ఆ పాటని ఆస్వాదించేలోపే ఆయన స్టేజీపైకి ఎక్కి డ్యాన్స్ తో రాక్ చేసేస్తుంటాడు. అంటే పాటకి సంబంధించి దేవి అన్నీ చేసేస్తాడన్నమాట. అందుకే దేవి గురించి ఆయన థిక్కెస్ట్ ఫ్రెండ్ సుకుమార్ `మన ఇండియాలోనే దేవిలాంటి మ్యూజిక్ డైరెక్టర్ లేడ`ని చెబుతుంటాడు. అయితే కుమారి 21 ఎఫ్ సినిమాకోసం ఆయన కొరియోగ్రాఫర్ అవతారం కూడా ఎత్తాడు. అంటే ట్యూన్ చేసి, దానికి లిరిక్ రాసి, సొంతంగా పాట పాడి, సొంతంగా కొరియోగ్రాఫ్ చేశాడన్నమాట. అంతే కాదండోయ్... ఆ పాటని స్వయంగా దేవినే ఎడిట్ చేశాడట. ఇప్పుడు సుక్కునే కాదు... మనం కూడా అనాల్సిందే. దేవిలాంటి మ్యూజిక్ మన ఇండియాలోనే లేడని.
నిజంగా ఇన్నేసి పనులు చేసిన మ్యూజిక్ మనకి ఎక్కడా కనిపించడేమో! కుమారి 21 ఎఫ్ కోసం దేవి శ్రీప్రసాద్ సమకూర్చిన బ్యాంకాక్ పాట ఫుల్ పాపులర్ అయ్యింది. స్లోలీ స్లోలీ... అంటూ సాగే ఆ పాట కుర్రకారుకి భలే నచ్చింది. సినిమాకి కూడా ఆ పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ పాటకోసం చిత్రబృందం బ్యాంకాక్ వెళ్లి అక్కడే షూట్ చేశారు. అందుకు సంబంధించి మేకింగ్ వీడియోని సోమవారం విడుదల చేశాడు. సినిమాలో పాట ఎంత జోష్ నిస్తుందో మేకింగ్ వీడియో కూడా అంతే జోష్ గా సాగుతోంది. అంత జోష్ తో పనిచేశారు కాబట్టే ఆ పాట అంతగా వర్కవుటయ్యిందన్నమాట.