మొన్నటివరకు అసలు పివిపి బ్యానర్ అంటేనే హై బడ్జెట్ సినిమాలు. చిన్న సినిమాలను కనీస మాత్రంగా ప్రొడ్యూస్ చేసిందే లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. సైజ్ జీరో.. ఊపిరి.. బ్రహ్మోత్సవం.. ఇలా అన్నీ హై బడ్జెట్ మూవీస్ ఈ సంస్థ నుండి వచ్చాయి. అధినేత పివిపి కూడా ఎక్కడా తగ్గకుండా 60 కోట్ల పెట్టుబడి ఒక్కోసినిమాపై పెట్టేశారు. కాని చివరకు ఈ సినిమాలన్నీ దెబ్బేశాయి.
కొన్ని సినిమాలకు కేవలం పెట్టిన పెట్టుబడి ఎలాగొలా తిరిగొస్తే.. బ్రహ్మోత్సవం సినిమాలో మాత్రం సగంపైగా పోయింది. అంతే కాకుండా.. 30+ కోట్లు మాత్రమే రికవర్ అవ్వడంతో.. పంపిణీదారులు కూడా మరో సినిమా ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఈ సమయంలో వంశీ పైడిపల్లి డైరక్షన్లో మహేష్ బాబుతో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన పివిపి.. వేరే పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టట్లేదు. కేవలం ఓంకార్ తో రాజు గారి గది 2.. అలాగే మరో ఇద్దరు చిన్న సినిమా మేకర్లతో ఇంకో రెండు చిన్న సినిమాలూ తీస్తున్నారట. చూస్తుంటే పెద్ద సినిమాలు కొట్టిన దెబ్బతో ఈయన బాగానే చేంజ్ అయ్యాడని అనుకోవచ్చు.
పైగా ''క్షణం'' అనే సినిమాను తమ బ్యానర్ లో తీస్తున్నప్పుడు పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా.. దాని రిజల్టు చూసి షాకైపోయుంటారు. అలాగే బ్రహ్మోత్సవం కూడా లైఫ్ టైమ్ గుర్తుండిపోయే షాకిచ్చింది. అందుకే ఇప్పుడు క్యాస్టింగ్ మీద కాసులు కురిపించకుండా.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని పివిపికి జ్ఞానబల్బు వెలిగింది.