రామ్ గోపాల్ వర్మ కంటే మించిన మార్కెటింగ్ గురు టాలీవుడ్ లో లేరని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. నిజానికి ఒక సినిమాలో కనీసం టీజర్ ట్రైలర్ లకు సరిపోయే కంటెంట్ ఉన్నా ఆ సినిమాను ప్రమోట్ చెయ్యవచ్చు. కానీ అవి కూడా లేని సినిమాలకు వర్మ పబ్లిసిటీ కల్పించే తీరును చూసి ఫిలిప్ కోట్లర్ కూడా షాక్ తింటారు. ఈ కోట్లర్ ఎవరు అంటారా? మార్కెటింగ్ మీద పాపులర్ బుక్స్ రాసిన మేథావి.
వర్మ ఈమధ్య 'బ్యూటిఫుల్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా 'రామ్ గోపాల్ వర్మ డ్రీమ్' అని 'రంగీలాకు నీరాజనం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు వర్మతో కలిసి సహాదర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ 'బ్యూటిఫుల్' సినిమాకు దర్శకుడు. ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. వర్మ కంపెనీ నుంచి వచ్చే మెజారిటీ సినిమాల తరహాలోనే ఈ సినిమా ట్రైలర్ లో కొత్తదనం ఏమీ లేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది.
ఈ సినిమా నిజానికి ఈమధ్య తెరకెక్కించినది కాదని 2016 లోనే ఈ సినిమాను షూట్ చేశారని.. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆ అవుట్ పుట్ ను చూసి భరించలేక పక్కన పెట్టారని సమాచారం. అప్పట్లో 'వంగవీటి' లో నటించిన నైనా గంగూలి పై 'రంగీలా' టైపు సినిమా తీయమని శిష్యుడు అగస్త్యకు చెప్తే ఆ సినిమా అవుట్ పుట్ అలా వచ్చిందట. ఈమధ్య 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తో అగస్త్య మంజు కు పాపులారిటీ వచ్చింది. దీంతో ఈ పాత రంగీలా మసాలాను తెరపైకి తీసుకొచ్చాడట. ఇలా మూడేళ్ళ క్రితం పక్కన పెట్టిన సినిమాకు ఇలాంటి ప్రమోషన్ ఎవరు చేయగలరు చెప్పండి? మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పిస్తుందో వేచి చూడాలి.