సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా అంటే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ శంకర్ తో వచ్చిన సినిమా అంటే చాలా కాలం ఎదురు చూడాలి. ఆయన సినిమాకు సినిమాకు కనీసం మూడేళ్లు గ్యాప్ తీసుకుంటాడు. స్క్రిప్టు పనికి ఏడాది.. షూటింగుకి ఓ ఏడాదిన్నర.. పోస్ట్ ప్రొడక్షన్ కి ఆరు నెలలో ఏడాదో పడుతుంది. మిగతా డైరెక్టర్లందరూ స్పీడందుకున్నా కానీ.. శంకర్ మాత్రం ఈ విషయంలో ఏం మారలేదు. ఏమాత్రం తొందరపడకుండా, రాజీ పడకుండా తాపీగా సినిమాలు చెక్కడం శంకర్ కు అలవాటు. అందుకే ‘ఐ’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా రోబో-2 మొదలవలేదు.
ఎట్టకేలకు రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ‘రోబో-2’ను లాంఛనంగా మొదలెట్టేద్దామనుకుంటే వరదలు వచ్చి పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ప్రారంభోత్సవ వేడుక నిర్వహించడం సాధ్యం కాదని.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే చెన్నైలో షూటింగ్ కూడా కష్టమే అన్నట్లు పరిస్థితులుండటంతో ఇంకో నెల రోజుల తర్వాతే సినిమా మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇక రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమా కాబట్టి.. మున్ముందు షూటింగ్ విషయంలో.. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బాగానే టైం పట్టడం ఖాయం. శంకర్ సినిమాలు ఏవీ కూడా ప్రణాళిక ప్రకారం పూర్తికావు. వాయిదాల పర్వం అన్నది కామన్. రోబో-2 ప్రారంభోత్సవం గురించి ఆర్నెల్ల నుంచి వార్తలొస్తున్నాయి. కానీ వాయిదా పడి పడి.. ఎట్టకేలకు సినిమా మొదలవుతుంటే అనుకోని ఆటంకం వచ్చింది. మున్ముందు మనం మరిన్ని వాయిదాలు చూస్తాం. శంకర్ స్పీడ్ ప్రకారం చూస్తే 2017 చివరికి గానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేనట్లే.