అద్దె ఇంటిపై క‌న్నేసిన భార్యాభ‌ర్త‌లు!

ఇది అద‌నంగా అమ్మ‌డి బ్రాండ్ ఇమేజ్ ని గుర్తించి ఇచ్చిన మ‌రో అవ‌కాశం.

Update: 2024-09-28 19:30 GMT

బాలీవుడ్ లో విద్యాబాల‌న్ ఎంత పెద్ద హీరోయిన్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఒక్కో సినిమాకు కోట్ల లో పారితోషికం తీసుకుంటుంది. బ్రాండ్ అంబాసిడ‌ర్ గానూ వ్య‌వ‌హ‌రిస్తూ అక్క‌డా మంచి ఆదాయం చూస్తోంది. ప్ర‌భుత్వానికి సంబంధించిన ప్ర‌క‌ట‌నలు సైతం చేస్తోంది. ఇది అద‌నంగా అమ్మ‌డి బ్రాండ్ ఇమేజ్ ని గుర్తించి ఇచ్చిన మ‌రో అవ‌కాశం.

అక్క‌డ ఉచిత స‌ర్వీస్ అయినా ఆ ఇమేజ్ తో మ‌రెన్నో ప్ర‌యివేట్ యాడ్స్ చేస్తుంది. త‌ద్వారా కోట్ల‌లో ఆదాయం అక్క‌డ నుంచి స‌మ‌కూరుతుంది. ఇక భ‌ర్త సిద్దార్ధ్ రాయ్ క‌పూర్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రు. వంద‌ల కోట్ల పెట్టుబ‌డితో సినిమాలు నిర్మిస్తుంటారు. ఇలా బాలీవ‌డ్ లో ఇద్దరూ అత్యత్తమ స్థానాల్లోనే ఉన్నారు. అలాంటి జోడీ అద్దె ఇంట్లో ఉన్నారు? అంటే ఎంత‌మంది న‌మ్ముతారు? కానీ ఇది న‌మ్మాల్సిన నిజం.

పెళ్లికి ముందు అద్దె ఇంట్లోనే..పెళ్లైన త‌ర్వాత కూడా విద్యాబాల‌న్ అద్దె ఇంట్లో ఉంటోన్న సంగ‌తిని తాజాగా రివీల్ చేసింది. అందుకు ఓప్ర‌త్యేక కార‌ణంగా ఉందంది. పెళ్లి త‌ర్వాత కొత్త సొంతిల్లు కొనుక్కోవా ల‌నుకున్నాం. న‌చ్చిన ఇల్లు కోసంచాలా వెతికాను. కానీ ఏది న‌చ్చ‌లేదు. చివ‌రిగా ఓ ఇల్లు న‌చ్చింది. అదే మేము ప్ర‌స్తుతం ఉంటోన్న అద్దె ఇల్లు. దాని కొనాల‌ని ఓన‌ర్లును అడిగాం. కానీ వారు అమ్మ‌డం కుద‌ర‌ద‌ని చెప్పారు.

దీంతో ఈ ఇంటిని కొనలేక.. అందులోనే అద్దెకు ఉంటున్నాం. ఇది స‌ముద్రానికి ఎదురుగా ఉంటుంది. బీచ్ వ్యూ ఎంతో అందంగా ఉంటుంది. ఎలాంటి ప‌రిస్థితుల్లో ఇంటికొచ్చినా? ఇంటి నుంచి బీచ్ ని చూస్తే రిలాక్స్ అయిపోతాం` అంది. ప్రస్తుతం విద్యాబాల‌న్ నటించిన `భూల్ భూలయ్య 3` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Tags:    

Similar News