దేవ‌ర‌కొండ షాకింగ్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్@కుంభ‌మేళ!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌ల్లితో క‌లిసి కుంభ‌మేళాను ద‌ర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాడు.

Update: 2025-02-09 14:57 GMT

కుంభ‌మేళా పుణ్య స్నానాల‌కు పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు కూడా త‌ర‌లి వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సంయుక్త మీనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు లాంటి న‌టీన‌టులు పుణ్య స్నానాలు ఆచ‌రించారు. ఎంతో భ‌క్తి శ్ర‌ద్దాల‌తో ప్ర‌యాగ్ రాజుకు చేరుకుని స్నానాలు ఆచ‌రించి ద‌ర్శ‌నాలు ముగించారు. తాజాగా ఈ జాబితాలో దేవ‌ర‌కొండ ఫ్యామిలీ కూడా చేరింది.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌ల్లితో క‌లిసి కుంభ‌మేళాను ద‌ర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ కుంభమేళాలో పాల్గొనడానికి సినిమా షూటింగుల నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే కుంభ‌మేళ‌లో కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాల ధరించి కనిపించాడు.

 

ఈ స‌న్నివేశంతో విజ‌య్ లోకూడా భ‌క్తి క‌ల‌వార‌ని తెలుస్తోంది. అయితే ఇక్క‌డో స్పెష‌ల్ ఉంది. అదే విజ‌య్ లుక్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్. గ‌త చిత్రాల్లో స్లిమ్ గా క‌నిపించిన విజ‌య్ కొత్త సినిమా కోసం భారీ దేహంతో క‌నిపిస్తున్నాడు. కండ‌లు తిరిగిన శ‌రీరంతో జిమ్ బాడీని త‌ల‌పిస్తున్నాడు. మ‌జిల్స్, చెస్ట్ స‌హా మొత్తం శ‌రీరంలో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. వాస్త‌వానికి లైగ‌ర్ సినిమా స‌మ‌యంలో బాడీలో ఛెంజెస్ తీసుకొచ్చాడు.

తాజాగా వీడి 12వ చిత్రం కోసం లుక్ ప‌రంగా మ‌రింత ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అవ‌స‌రం కావ‌డంతో? అందుకు త‌గ్గ‌ట్టు బాడీని మ‌లిచాడు. అలాగే త‌దుప‌రి చిత్రం రాహుల్ సంకృత్య‌న్తో చేస్తున్నాడు. అందులోనూ విజ‌య్ క‌టౌట్ భారీగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆ సినిమా కోస‌మే ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అవుతున్న‌ట్లు వార్త లొస్తున్నాయి. తాజాగా విజ‌య్ లుక్ తో మ‌రింత ఇంట్రెస్టింగ్ గా మారిందా ప్రాజెక్ట్.

Tags:    

Similar News