స్లిప్పయిన దేవరకొండ.. వారి అత్యుత్సాహం అవసరమా?
సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలోనే బాక్సాఫీస్ రికార్డులను సైతం తిరగరాశాడు.
అసలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి హీరోగా వచ్చినా.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలోనే బాక్సాఫీస్ రికార్డులను సైతం తిరగరాశాడు. అయితే విజయ్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటు ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ అతని క్రేజ్ అసలు తగ్గలేదు.
ఇప్పటికే తన చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘హీరియే హీరియే’ ఫేం జస్లీన్ రాయల్‌తో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసినట్లు ఇటీవలే న్యూస్ బయటకు వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఆమె ఓ ఫొటోను కూడా షేర్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇందుకోసం అతడు ముంబై వెళ్లినట్లు తెలిసింది. అయితే హఠాత్తుగా విజయ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ తాజాగా ఓ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత కిందకు వస్తున్న సమయంలో అతడు మెట్లు దిగుతూ కనిపించాడు. అప్పుడు అతడు అనుకోకుండా కాలు జారి పడిపోయాడు. దీంతో పక్కన ఉన్న వాళ్లు వెంటనే పైకి లేపారు. ఈ ఘటనలో హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మెట్లు దిగుతూ కాలు జారి పడిపోయిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో దీనికి చాలా తక్కువ సమయంలోనే మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అతను పడిన విధానాన్ని కూడా మీడియాలో అతిగా చూపిస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా స్లిప్ అయ్యి పడిన దానికి పెద్ద న్యూస్ అన్నట్లు పలు బాలీవుడ్ మీడియా పేజ్ లు హైలెట్ చేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ పడిపోయాడు అంటూ అత్యుత్సహం చూపిస్తున్న మీడియా వారికి నెటిజన్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. సాధారణంగా రోజు వారీ ప్రయాణంలో అలాంటి చిన్న చిన్న అనుభవాలు అందరికి ఎదురవుతాయి. దానికి ఇంతలా హడావుడి చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో సినిమాను ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో లైన్ లో పెట్టాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.