VD12: యంగ్ టైగర్ గర్జన ఫిక్స్ అయినట్లే

ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు.

Update: 2025-02-10 12:46 GMT

టాలీవుడ్‌లో నెక్స్ట్ రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో VD12 ఒకటి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్‌తో వార్తల్లో నిలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చేయని యాక్షన్ డ్రామాను ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు.

భారీ బడ్జెట్, స్టైలిష్ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ఫిబ్రవరి 12న మూవీ టైటిల్ అండ్ టీజర్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇదే క్రమంలో మేకర్స్ సోషల్ మీడియాలో టీజర్ రిలీజ్‌కు ముందు పలు టీజింగ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ కొత్త లుక్ అదిరిపోయిందని సినీ అభిమానులు కామెంట్ చేశారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్‌కు ముందే మేకర్స్ క్రియేటివ్ ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇతర భాషల కోసం కూడా ప్రముఖులు ఈ పనిని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా, నిర్మాత నాగ వంశీ చేసిన ట్వీట్ మరో సంచలనానికి దారి తీశింది. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో టైగర్ ఎమోజీ షేర్ చేయడం గమనార్హం.

దీనికి విజయ్ దేవరకొండ లవ్ ఎమోజీతో రిప్లై ఇవ్వడం మరింత హైప్ క్రియేట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు రివీల్ చేయకుండానే, నాగ వంశీ ఈ ట్వీట్‌తో పరోక్షంగా సంకేతం ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరి ట్వీట్లతో ఫ్యాన్స్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజంగానే ఎన్టీఆర్ VD12లో వాయిస్ ఓవర్ అందించనున్నాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే, VD12 మూవీని అత్యంత ప్రాముఖ్యతతో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. నాగవంశీ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హైప్ తారాస్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News