జీవితాంతం చెప్పులేకుండానే తిరుగుతాన‌న్న‌ హీరో!

కూల్ అండ్ కామ్ గయ్..హీరో కం డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-05-30 17:30 GMT

కూల్ అండ్ కామ్ గయ్..హీరో కం డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మిళ న‌టుడైనా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో బాగా ద‌గ్గ‌రైన న‌టుడు. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు అభిమాన‌లు త‌న‌పై చూపించే ప్రేమాభిమానాల గురించి మీడియా స‌మ‌క్షంలో ఎంతో గొప్ప‌గా చెబుతాడు. త్వ‌ర‌లో తుఫాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా చెప్పులు లేకుండా తిరుగుతోన్న స్టోరీ గురించి రివీల్ చేసాడు. `మూడు నెల‌లుగా చెప్పులు లేకుండా తిరుగుతున్నాను. ఎలాంటి ప‌రిస్థితుల్లో కూడా చెప్పులు వేసుకోకూడ‌ద‌ని భావించి నేల‌పై న‌డుస్తున్నాను. దీంతో అంద‌రూ నేను ఏదో దీక్ష తీసుకున్నాన‌ని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఒక రోజు చెప్పులు లేకుండా న‌డిచాను. చాలా ప్ర‌శాంతంగా అనిపించింది. అలా న‌డ‌వ‌డం ఆరోగ్యానికి కూడా మంచింది.

మ‌నపై మ‌న‌కు న‌మ్మ‌కం కూడా పెరుగుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్న‌ప్ప‌టి నుంచి ఒత్తికిడి గురి కాలేదు. అందుకే జీవిత‌మంతా చెప్పులు వేసుకోకూడ‌ద‌ని అనుకుంటున్నా` అని అన్నారు. ఇత‌ని లాగే తెలుగు ద‌ర్శ‌కుడు అనుదీప్ కూడా చెప్పులు లేకుండానే తిరుగుతాడు. అడిగితే చెప్పులు వేసుకునే అల‌వాటు లేద‌ని...చిన్నప్ప‌టి నుంచి ఇలాగే నేల‌పైనే న‌డుస్తున్నట్లు తెలిపాడు.

నిజానికిది చాలా మంచి హాబీ. చెప్ప‌లు లేకుండా పాదాల‌తో నేల‌పై ప‌రిగెత్తుమ‌ని డాక్ట‌ర్లు కూడా సూచింస్తారు. వాకింగ్ చేసే వాళ్లు కూడా చెప్పులు లేకుండా చేస్తే మంచిద‌ని అనుభ‌వ‌జ్ఞులు చెబుతుంటారు. కానీ దీన్ని ఆచ‌రించే వారే త‌క్కువ‌. కానీ విజయ్ అంటోనీ, అనుదీప్ లాంటి వారు ఆచ‌రించాలి అనుకునే వారికి స్పూర్తిగా చెప్పొచ్చు. చూద్దాం ఇంకెంత మంది చెప్పులు లేని హీరోలు తెరపైకి వ‌స్తారో.

Tags:    

Similar News