అలాంటి రిస్క్ చేయనంటున్న దేవరకొండ..!

తను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ని అని.. గతంలో ఒక అమ్మాయిని ప్రేమించా కానీ అది వర్క్ అవుట్ కాలేదని అన్నాడు విజయ్ దేవరకొండ.

Update: 2024-04-01 04:16 GMT

యూత్ ఫుల్ హీరోగా విజయ్ దేవరకొండ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సినీ నేపథ్యం లేకపోయినా అతి తక్కువ టైం లోనే తన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పెళ్లిచూపులుతో హిట్ అందుకుని అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా ఇలా వరుస క్రేజీ హిట్లు కొట్టాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో అతని యాటిట్యూడ్ కి ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. దేవరకొండ సినిమా వస్తుంది అంటే యువత అంతా ఈగర్ గా ఎదురుచూసేలా క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ తో రాబోతున్న సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఏదో ఒక టైం లో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారన్న దేవరకొండ ఒకే టైం లో ఇద్దరిని ప్రేమించడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నాడు. ఏవో కారణాల వల్ల వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే కానీ ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించనని అంటున్నాడు విజయ్ దేవరకొండ.

తను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ని అని.. గతంలో ఒక అమ్మాయిని ప్రేమించా కానీ అది వర్క్ అవుట్ కాలేదని అన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ లాంటి హీరోని కాదన్న ఆ అమ్మాయి ఎవరో కానీ అన్ లక్కీ గాళ్ అని అంటున్నారు ఆడియన్స్. ఇక సినిమాల విషయంలో కూడా తన పంథా తనదే అంటున్నాడు విజయ్. కొత్త దర్శకులతో రిస్క్ చేసే పరిస్థితి లేదని. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేకుండా సినిమాను హ్యాండిల్ చేయడం బడ్జెట్, సినిమా మేకింగ్ మేనేజ్ చేయడం కష్టమని అందుకే తాను కనీసం ఒక సినిమా అనుభవం ఉన్న హీరోతో పనిచేస్తానని అన్నాడు.

డైరెక్టర్ గా ఒక సినిమా చేస్తే చాలు అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా తనకు అనవసరమని.. అలాంటి వారితోనే సినిమా చేస్తానని విజయ్ దేవరకొండ చెప్పాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5న సినిమాతో రాబోతున్నాడు. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇంపెస్ చేయగా ఈ సమ్మర్ కి ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ఫ్యామిలీ స్టార్ వస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు.

Tags:    

Similar News