దేవరకొండతో సేఫ్ అనుకుంటున్న దిల్ రాజు..!
ఇక ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండతో దిల్ రాజు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. మూవీలో విజయ్ దేవరకొండకి జతగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ కి సోలోగా వస్తున్న దేవరకొండ భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ.
ఇక ఈ సినిమా తర్వాత VD13వ సినిమాగా రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో ఉంటుందని టాక్. రాజావారు రాణి గారు సినిమాతో ప్రతిభ చాటిన డైరెక్టర్ రవి కిరణ్ రీసెంట్ గా విజయ్ కి ఒక కథ వినిపించాడట. కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట విజయ్. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేసే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ ఫ్యామిలీ స్టార్ చేసిన విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే చేసే ఆలోచనలో ఉన్నాడు.
లేటెస్ట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా డైరెక్టర్ విద్యాసాగర్ కూడా విజయ్ కి కథ చెప్పగా అది కూడా నచ్చడంతో విజయ్ ఓకే చెప్పినట్టు టాక్. ఈ సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కించాలని చూస్తున్నారట. అలా ఫ్యామిలీ స్టార్ తో మొదలు పెట్టి ఆ తర్వాత మరో రెండు సినిమాలు అలా హ్యాట్రిక్ సినిమాలతో దిల్ రాజు తో భారీ డీల్ ఏర్పరచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.
రాజు గారు కూడా విజయ్ కు ఉన్న యూత్ ఫాలోయింగ్ గురించి తెలుసు కాబట్టి లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా పూర్తి చేస్తే కచ్చితంగా సేఫ్ అవ్వొచ్చనే లెక్కలతోనే రౌడీ హీరోతో వరుస సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ హిట్ పడింది అంటే ఈ కాంబో క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు తర్వాత రాబోతున్న రెండు సినిమాలకు కూడా ప్లస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఖుషిత్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకోగా తన మార్క్ సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.