విజయ్ దేవరకొండ.. ఈ దర్శకుల పరిస్థితేంటి?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-04-10 15:30 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పరుశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అయితే ఉగాది పండుగ రోజు పర్వాలేదు అనేలా ఉన్నాయి. అయితే మొదటిరోజు మాత్రం పూర్తిస్థాయిలో సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమయింది.

ఎక్కువగా మిక్స్ డ్ టాక్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా మాత్రం బాగా మెప్పించింది అని చిత్ర యూనిట్ ఎంతో ధీమాతో చెబుతోంది. ఇక ఈ సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ లైగర్ ఖుషి సినిమాలతో బిగ్ సక్సెస్ అందుకోవాలని చూశాడు. కానీ అవి అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కచ్చితంగా నెక్స్ట్ సినిమాతో అయితే పర్ఫెక్ట్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక అతని కోసం లైన్ లో ఉన్న దర్శకులపై కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది అని చెప్పవచ్చు. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ కంటెంట్ తో ఆడియన్స్ ను మెప్పించాల్సి ఉంటుంది. మళ్ళీ యావరేజ్ టాక్ వచ్చినా కూడా విజయ్ దేవరకొండ మార్కెట్ పై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ ను గమనిస్తే నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను ఇదివరకే స్టార్ట్ చేశాడు.

ఈ సినిమాలో విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఒక లెక్క.. ఇప్పుడు ఇందులో కనిపించబోయే రోల్ మరొక లెక్క అనేలా ఉండబోతోంది. అలాగే రాజావారు రాణివారు డైరెక్టర్ రవి కిరణ్ కూడా ఒక సినిమా చేసేందుకు ఇదివరకే గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఇక టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ కూడా ఈ లైన్లో ఉన్నాడు.

ఈ కాంబినేషన్ ను మైత్రి మూవీ మేకర్స్ తెరపైకి తీసుకురాబోతోంది. అలాగే మరో మలయాళం దర్శకుడితో కూడా విజయ్ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఈ లైనప్ లో ఉన్న కథలు వేటికవే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం తప్పకుండా తదుపరి సినిమాలతో పర్ఫెక్ట్ సక్సెస్ అందుకుంటేనే భవిష్యత్తులో మార్కెట్ పరిధి మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది.

తప్పకుండా 200 కోట్లు ఏదో ఒక రోజు కొట్టి చూపిస్తాను అని కూడా విజయ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఇక రాబోయే ఈ దర్శకులతో ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అంటే మేకింగ్ విషయంలోనూ క్యారెక్టర్ విషయంలోనూ అలాగే మ్యూజిక్ లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా విజయ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దర్శకులు కూడా మరో రేంజ్ కు వెళ్లాలి అంటే విజయ్ తో మినిమం సక్సెస్ అందుకోవాల్సి ఉంది. మరి విజయ్ ఈ దర్శకులతో ఎలాంటి సక్సెస్ లో అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News