వాళ్లిద్దర్నీ లైన్ లో పెట్టిన దేవరకొండ!
విజయ్ దేవరకొండ `ఖుషీ`తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. `లైగర్` తో ఎదుర్కున్న విమర్శల న్నింటికీ `ఖుషీ` తో చెక్ పెట్టాలని చూస్తున్నాడు.
విజయ్ దేవరకొండ `ఖుషీ`తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. `లైగర్` తో ఎదుర్కున్న విమర్శల న్నింటికీ `ఖుషీ` తో చెక్ పెట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అందుకే సినిమాని ప్రత్యేకంగానూ ప్రమోట్ చేస్తున్నాడు. స్టేజ్ లపై లైవ్ పెర్పార్మెన్స్ లు.. వ్యక్తిగత విషయాలు సైతం షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి? అన్నది చూడాలి. ఇక రిలీజ్ తో సంబంధం లేకుండా యంగ్ హీగ్ హీరో చేతిలో దండీగా ప్రాజెక్ట్ లున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురైదుగురు దర్శకులు స్టోరీలు చెప్పి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు తమిళ దర్శకులు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్..అరుణ్ ప్రభులు చెప్పిన స్టోరీలు కూడా విన్నానుడట.
కథలు నచ్చడంతో వాటికి ఒకే చెప్పాడుట. అయితే అవి ఇంకా పూర్తి స్థాయిలో కథలు సిద్దంగా కాలేదం టున్నాడు. అలా రెడీ అయిన అనంతరం వాటిపై ఓ క్లారిటీ వస్తుందన్నాడు. రెడీ అయి ఒకే అయితే గనుక వెంటనే వాటిని పట్టాలెక్కిస్తాడు. ఇక నటించాల్సిన కలల పాత్రలంటూ ఏమీ లేవుట. లాక్ అయిన కథలన్ని మంచివే. అలాంటి కథల్లో నటిస్తానని ఏనాడు ఊహించలేదుట.
అవన్నీ తన వద్దకు అనుకోకుండా వచ్చినవని తెలిపాడు. అలాగే సందీప్ రెడ్డి వంగతోనూ ఓ సినిమా ఉంటుంది. కానీ అదెప్పుడు? అన్నది క్లారిటీగా చెప్పలేను అంటున్నాడు. ఇక `పోకిరి` సినిమాలో మహేష్ పరిచయ సన్నివేశాలున్న సినిమా లాంటింది ఒకటి చేయాలంటున్నాడు. అలాంటి సీన్ ఒకటి తన సినిమాలో కుదిరితే బాగుంటుంది. అది మాత్రం ఓ చిన్న డ్రీమ్ గా ఉందిట. మహేష్ ని రౌడీలు వెంబడించు కుంటూ వస్తోన్న సమయంలో `సమరమే` అంటూ ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అలాంటి సీన్ లో కనిపించాలంటున్నాడు.