మరో రెండేళ్లలో విజయ్ దేవరకొండ పెళ్లి షురూ!
ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటే చేసుకోను..చూద్దాం అనే మాటలకు బధులుగా రెండు.. మూడేళ్లలో పెళ్లి చేసుకుంటాని కాన్పిడెంట్ గా చెబుతున్నాడు
విజయ్ దేవరకొండ వివాహానికి వెళాయేనా? పెళ్లి విషయంలో యంగ్ హీరో ఆలోచన మారిందా? అంటే అవుననే తెలుస్తోంది. రెండేళ్ల క్రితం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటే? ఇప్పట్లో చేసుకోనని...ధాంపత్య జీవితంలో ఒడిదుడుకుల గురించి పెద్ద లెక్చర్ ఇచ్చాడు. తనకంటే ముందే తన తమ్మడు ఆనంద్ దేవరకొండ పెళ్లి అవుతుందని... ఆ తర్వాత అన్ని అనుకూలిస్తే చేసుకుంటాను లేకపోతే లేదనపేసాడు.
అయితే యంగ్ హీరో జీవితంలో కొన్ని సంఘటనలు మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. తన స్నేహితులు కొందరు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోష గడియల గురించి తనతో చెప్పుకొచ్చారుట. పెళ్లి పై తనకుండే అయిష్టాన్ని ఆ రకంగా కొంతవరకూ దూరం చేసినట్లు తెలిపాడు. అలాగే ప్రస్తుతం 'ఖుషీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ కి జోడీగా సమంత నటిస్తోంది.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ మంచి భర్త పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రేమించిన సమంతని పెళ్లాడి ధాంపత్య జీవితం గురించి సినిమా ద్వారా కూడా తెలియని కొన్ని విషయాలు తెలుసుకున్నట్లు విజయ్ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇలా స్నేహితులు..ఖుషీ సినిమా విజయ్ వ్యక్తిగత జీవితంలో కొన్ని రకాల మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పొచ్చు.
ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటే చేసుకోను..చూద్దాం అనే మాటలకు బధులుగా రెండు.. మూడేళ్లలో పెళ్లి చేసుకుంటాని కాన్పిడెంట్ గా చెబుతున్నాడు. ఇప్పటికే కెరీర్ లో నిలదొక్కుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిరూపించుకున్నాడు.స్టార్ గా ఇంకా బోలెడంత లైఫ్ ఉంది. వివాహం తర్వాత కెరీర్ ని దేదీప్యమానంగా ముందుకు సాగించే ప్రణాళిక విజయ్ వద్ద ఉన్నట్లు కనిపిస్తుంది.
వివాహం చేసుకోని కొందరు తమ అనుభవాలు పాఠాల రూపంలో చెబుతుంటే? వివాహంపై ఆశలు పుట్టడం సహజం. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ . నారాయణమూర్తి కూడా పెళ్లి చేసుకోకుండా తప్పు చేసానని చాలా సందర్భాల్లో అన్నారు. వయసులో ఉన్నప్పుడు...వయసు ముదిరిన తర్వాత జీవితానికి ఓ తోడు కావాలని..అది భార్య రూపంలో అయితేనే! ఆ జీవితం పరిపూర్ణం అవుతుందని ఆయన తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేసారు.