దేవరకొండ సినిమా కూడా రెండు భాగాలుగానే?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. శ్రీలీలను మూవీలో ముందుగా హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆమె తప్పుకుందని తెలుస్తోంది. శ్రీలీల స్థానంలో రష్మిక మందనని ఖరారు చేశారంట.
త్వరలో అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ చేస్తోన్న మూవీ ఇదే. సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన హీరో కథని గౌతమ్ చూపించబోతున్నాడంట. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకేక్కిస్తోంది. ఖుషి మూవీ తర్వాత విజయ్ నుంచి రాబోయే సినిమా ఇదే కావొచ్చు.
అయితే పరశురామ్ తో చేస్తోన్న మూవీ షూటింగ్ వేగంగా కంప్లీట్ అయితే ఆ చిత్రాన్ని ముందు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే VD 12 చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారంట. ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. రెండు భాగాలుగా మూవీ ఉంటుందని ముందుగానే ఎనౌన్స్ చేస్తున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయితే పార్ట్ 2పైన హైప్ పెరుగుతుందని ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు.
అయితే కొన్ని సినిమాలు రెండు భాగాలుగా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేస్తోన్న మొదటి పార్ట్ డిజాస్టర్ కావడంతో ఇక కొనసాగింపు ఆలోచన మేకర్స్ పక్కన పెడుతున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2, బాహుబలి 2 సినిమాలు సీక్వెల్స్ గా వచ్చి రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ కి ఐడియా ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చిత్రానికి కూడా సీక్వెల్ ఐడియా ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ కెరియర్ లో పాన్ ఇండియా బ్రాండ్ తో వచ్చిన లైగర్ డిజాస్టర్ అయ్యింది, అలాగే ఖుషి సినిమా కూడా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లోనే VD 12 తెరకెక్కుతోన్న నేపథ్యంలో ఈ సారైన సక్సెస్ అందుకుంటారా అనేది చూడాలి.