లియో కంటే ఎక్కువగా GOAT బిజినెస్..?

ఇళయ దళపతి విజయ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

Update: 2024-08-13 04:48 GMT

ఇళయ దళపతి విజయ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. తమిళంలో అత్యధిక సార్లు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న హీరోగా విజయ్ ఉండడం విశేషం. ఆయన నుంచి చివరిగా వచ్చిన లియో మూవీ ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రికార్డ్ సృష్టించింది. యావరేజ్ టాక్ తో కూడా ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఉంటాయంట. టైం ట్రావెల్ కాన్సెప్ట్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో GOAT సినిమాని వెంకట్ ప్రభు చేస్తున్నారు. దీని తర్వాత విజయ్ మరొక్క సినిమా మాత్రమే చేసే అవకాశం ఉంది. దీనికి కారణం ఆయన రాజకీయ ప్రవేశం.

ఇప్పటికే విజయ్ కూడా అఫీషియల్ గా మరో రెండు సినిమాలు మాత్రమే చేస్తానని ప్రకటించారు. అందులో GOAT మూవీ ఒకటిగా రాబోతోంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని దళపతి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఒక సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే GOAT సినిమాతో మరోసారి దళపతి విజయ్ తన స్టామినా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. లియో మూవీ భారీ కలెక్షన్స్ రావడంలో లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. వరుసగా విజయ్ సినిమాలు సక్సెస్ అవుతూనే వస్తున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా విజయ్ దరిదాపుల్లో ఏ హీరో లేరు. అయితే ప్రస్తుతం విజయ్ GOAT మూవీ చేస్తోన్న డైరెక్టర్ వెంకట్ ప్రభుకి కమర్షియల్ ఇమేజ్ లేదు.

ఈ సినిమా కథ కూడా ప్రయోగాత్మకంగానే తెరకెక్కుతోంది. దీంతో మీ మూవీపై ఎలాంటి బిజినెస్ జరుగుతుందనే ప్రశ్న కొద్ది రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ కేరళ రైట్స్ 17 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. లియో సినిమా కేరళ రైట్స్ 16 కోట్లకు మాత్రమే సోల్డ్ అయ్యాయి. దానికంటే కోటి ఎక్కువగానే GOAT సినిమాకి రావడం విశేషం. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా GOAT మూవీకి రైట్స్ కి సాలిడ్ ధర లభించినట్లు తెలుస్తోంది. లియో సినిమా కంటే ఎక్కువగానే ఈ మూవీ రైట్స్ అమ్ముడైనట్లు టాక్. GOAT మూవీ కలెక్షన్స్ లియో వసూళ్లను బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దళపతి విజయ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నట్లు అవుతుంది.

Tags:    

Similar News