మ్యాన్‌ ఆఫ్‌ మాస్ ఎన్టీఆర్‌పై సేతుపతి కామెంట్

త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో న‌టిస్తూ సౌతిండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారాడు విజ‌య్ సేతుప‌తి.

Update: 2024-06-18 11:27 GMT

త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో న‌టిస్తూ సౌతిండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారాడు విజ‌య్ సేతుప‌తి. అత‌డి వ‌ల్ల సినిమా రేంజ్ పెరుగుతోంది. సినిమాకి మార్కెట్ విలువ పెరుగుతోంది. ఇటీవ‌లి కాలంలో త‌న‌దైన విల‌క్ష‌ణ న‌టన‌తో ఇంత‌గా ప్ర‌భావితం చేసిన మ‌రొక స్టార్ లేనే లేడంటే అతిశ‌యోక్తి కాదు. ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ స్థాయి స్టార్ల‌ను తార‌క్ ప్ర‌భావితం చేసాడు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ దర్శకుడు జేమ్స్ గన్, నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కూడా గతంలో మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడారు.

ప్రస్తుతం తన కొత్త చిత్రం `మహారాజా`ను ప్రమోట్ చేస్తున్న విజయ్ సేతుపతి అభిమానుల ఇంటరాక్షన్ సందర్భంగా తన ఫేవ‌రెట్ గురించి వెల్లడించాడు. అత‌డు ఒక సౌత్ స్టార్ కావ‌డం అందునా ఒక తెలుగు హీరో కావ‌డం విశేషం. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం! అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని సేతుప‌తి బహిరంగంగా చాటుకున్నాడు.

మ్యాన్ ఆఫ్ మాస్ అని అభిమానులు సంబ‌రంగా పిలిచుకునే జూనియర్ ఎన్టీఆర్ తనదైన హార్డ్ వ‌ర్క్ తో ప‌రిశ్ర‌మ‌లో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్.ఆర్.ఆర్ లో అద్భుతమైన నటనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలను సంపాదించాడు. అతడి మ‌ల్టీ ట్యాలెంట్ .. ఒదిగి ఉండే స్వభావం పరిశ్రమలోని అతని సహచరులను అభిమానులుగా మార్చాయి. ఫ్యాన్స్ అతడి ప్రేమ‌కు దాసీలు. అంతేకాదు చాలా మంది ప్రముఖులు యంగ్ టైగ‌ర్ కి అభిమానులు. ఇటీవల విజయ్ సేతుపతి తార‌క్ తో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. సౌతిండియాలో ఇద్ద‌రు పెద్ద స్టార్లు క‌లిసి స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవడం అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

అలియా భట్, దీపికా పదుకొణె, రిషబ్ శెట్టి సహా ప్రఖ్యాత సెలబ్రిటీలు యంగ్ య‌మ‌తో కలిసి పని చేయాలనే కోరికను ఇప్ప‌టికే వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన చిత్రం `దేవర` పార్ట్ 1 విడుద‌ల ప్ర‌చారం కోసం తార‌క్ ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Tags:    

Similar News