తెరపైకి మరో ఇద్దరు వారసులు!
ఇండస్ట్రీలో వారసుల పరంపర గురించి చెప్పాల్సిన పనిలేదు. తరతరాల నుంచి పరిశ్రమలో వారసత్వం కొనసాగుతూనే ఉంది.
ఇండస్ట్రీలో వారసుల పరంపర గురించి చెప్పాల్సిన పనిలేదు. తరతరాల నుంచి పరిశ్రమలో వారసత్వం కొనసాగుతూనే ఉంది. ఎవరో సినిమాలంటే ఆసక్తి లేని వారు తప్ప! మిగిలిన వారంతా వంశ శృక్షంతో ఎదిగే ప్రయత్నం చేస్తుంటారు. ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీల వారసులు తెరంగేట్రానికి రెడీ అవుతున్నారు. కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనితా విజయ్ కుమార్ అందరికీ సుపరిచితమే. ఇప్పుడామె కుమారుడు విజయ్ శ్రీహరి మ్యాకప్ వేసుకుంటున్నాడు.
విజయ్ , వనిత మాజీ భర్త ఆకాష్ కు పుట్టిన బిడ్డ. అలాగే తమిళ దర్శకుడు ప్రభుసాల్మన్ కుమార్తె హేజల్ షైనీ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇద్దరు ఒకే సినిమాతో లాంచ్ అవ్వడం విశేషం. ఆ బాధ్యతలు ప్రభుసాల్మన్ తీసుకున్నారు. ఇద్దర్నీ పరిచయం చేస్తూ ఓ సినిమా రూపొందించడానికి రెడీ అవుతున్నారు. కొత్త వారిని పరిచయం చేయడంలో సాల్మన్ కి మంచి అనుభవం ఉంది.
`కొక్కి` సినిమాతో కరణ్ ని ఇతడే పరిచయం చేసాడు. అలాగే `మైనా` సినిమాతో అమలాపాల్ ని కూడా ప్రభుసాల్మన్ పరిచయం చేసారు. `కుంకీ` అనే సినిమాతో విక్రమ్ ప్రభును కూడా ఇతడే లాంచ్ చేసాడు. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. `కాయల్` అనే సినిమాతో తెలుగు నటి ఆనందికి కూడా మంచి గుర్తింపు రావడంలో ఇతడే కీలక పాత్ర పోషించారు.
ఇలా ఇంత మందికి హిట్స్ ఇవ్వడంతోనే కోలీవుడ్ లో బెస్ట్ లాంచర్ గా పేరుగాంచారు. వనిత విజయ్ కూడా కుమారుడి ఎంట్రీకి సాల్మన్ అయితేనే కరెక్ట్ అని భావించి బాధ్యతలు ఆయన చేతుల్లో పెట్టినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారుట.