పాపం ప‌సోడు నిండా ప్రేమ‌లో మునిగాడు

ఈ ఫోటోషూట్ వీక్షించిన విజయ్ త‌న ప్రేమ‌ను దాచుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన లేడీ ల‌వ్ కోసం ఒక తీపి సందేశాన్ని ఇచ్చాడు.

Update: 2024-03-10 08:17 GMT

అవును.. ఇత‌గాడి ప్రేమ పిచ్చి పీక్స్ కు చేరుకుంది. నువ్వు లేని నేను లేను.. జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం మ‌న‌ది! అంటూ ఆమెను వీడి ఉండ‌టం లేదు! ఇక త‌న‌కు స‌రిజోడు, న‌చ్చిన చెలికాడు చిక్కాడు! అంటూ ఆమె కూడా అంతే సంబ‌ర‌ప‌డుతోంది. ప్ర‌స్తుతానికి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బంధం పెన‌వేసుకుంది. ఇన్ స్టా, ఎక్స్, టీవీ, యూట్యూబ్ వేదిక ఏదైనా ఈ జంట గురించే ముచ్చ‌ట‌. అంత‌గా ఇటీవ‌లి కాలంలో ఇండ‌స్ట్రీ చ‌ర్చ‌ల్లోకొచ్చిన వేరొక ప్రేమ‌క‌థ లేదు. ఇంత‌కీ ఇదంతా ఎవ‌రి గురించి అంటే... మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ ప్రేమాయ‌ణం గురించే ఈ స్టోరి.

విజయ్ వర్మ, తమన్నా భాటియా న‌డుమ ఓటీటీ తెర‌పై అద్భుతమైన కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంది. అంతేకాదు.. ఇది తెర‌వెన‌క కెమిస్ట్రీకి కూడా దారి తీసింది. ల‌స్ట్ స్టోరీస్ 2 లో చెల‌రేగిపోయిన ఈ జంట అటుపై తెర‌వెన‌క చాలా క‌థ‌లు న‌డిపిస్తోంద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇక ఈ ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య డేటింగ్ గురించి బ‌హిరంగంగానే అంగీక‌రించారు. ఒక‌రంటే ఒక‌రికి పరస్పర గౌరవం ప్రేమ‌ను చాటుకున్నారు. తమ సంబంధాన్ని అధికారికంగా చేసినప్పటి నుండి తమన్నా - విజయ్ తరచుగా ఒకరి సోషల్ మీడియా పోస్ట్‌లపై ఒక‌రు తీపి వ్యాఖ్యలను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం కనిపిస్తోంది.

ఇటీవల తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌ ఈవెంట్ నుండి అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో, బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ చీరను ధరించి కనిపించింది. ఈ ఫోటోషూట్ వీక్షించిన విజయ్ త‌న ప్రేమ‌ను దాచుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన లేడీ ల‌వ్ కోసం ఒక తీపి సందేశాన్ని ఇచ్చాడు. ఫైర్- హార్ట్ ఎమోజీలతో పాటు "మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రియురాలు" అని విజ‌య్ వ‌ర్మ అంద‌మైన‌ సందేశాన్ని రాశాడు. తమన్నా భాటియా బ్లాక్ అండ్ వైట్ చీర.. ఫ్లోర‌ల్ డిజైన్ బ్లాక్ బ్లౌజ్‌తో ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

విజ‌య్ - త‌మ‌న్నా జంట UK- లండన్‌లో కొంద‌రు సన్నిహితులతో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అయితే ఈ జంట లండ‌న్ షికార్ చాలా పెద్ద చ‌ర్చ‌కు తెర తీసింది. అప్ప‌టికే సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన లస్ట్ స్టోరీస్ 2లో ఈ జంట‌ కెమిస్ట్రీ సాన్నిహిత్యం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నిజ జీవితంలోను రొమాన్స్ స్టార్ట‌యిందంటూ ఒక‌టే ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ వార్త‌ల‌ను ఖండించ‌ని జంట తాము ప్రేమ‌లో ఉన్నామ‌ని ధృవీక‌రించింది.

Tags:    

Similar News