వర్మకి తమన్నా మనసిచ్చింది ఎప్పుడంటే?
ఈ విషయంలో విజయ్ వర్మ మాత్రం పెళ్లికి తాను సిద్దమే అన్నట్లు ఆయన వ్యాఖ్యానాలు కనిపించాయి.
తమన్నా-విజయ్ వర్మ ప్రేమ వ్యవహారం తెలిసిందే. ఇద్దరు కొంత కాలంగా సీరియస్ డేటింగ్ లో ఉన్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ఈ విషాయన్ని ఎంతో ఓపెన్ గానూ ఈ జోడీ షేర్ చేసుకుంది. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం క్లారిటీ లేని సమాధానమే తెరపైకి వస్తోంది. తమన్నా ఇంకా కెరీర్ లో తాను చేయాల్సిన ప్రయోగాలు చాలానే ఉన్నాయంటూ అంత వరకూ వెయిట్ చేయక తప్పదన్నట్లు వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో విజయ్ వర్మ మాత్రం పెళ్లికి తాను సిద్దమే అన్నట్లు ఆయన వ్యాఖ్యానాలు కనిపించాయి. మరి ఇద్దరి మధ్య వ్యవహారం ఎంత దూరం వెళ్తుందన్నది చూడాలి. ఇక ఈ జోడీ మధ్య ప్రేమాయణం ఎప్పుడు మొదలైంది? అంటే అందరికీ తెలిసింది ఒక్కటే. అదే `లస్ట్ స్టోరీస్-2`. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని..అప్పటి నుంచి డేటింగ్ ప్రారంభించినట్లు చాలా కాలంగా బలంగా వినిపిస్తోన్న వార్త.
అదీ బోల్డ్ కంటెంట్ కావడంతోనే...రీల్ రొమాన్స్ ని రియల్ రొమాన్స్ గా మార్చుకున్నారు అన్నది అందరి దగ్గర ఉన్న సమాచారం. కానీ అసలు సంగతి అది కాదంటూ విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చేసాడు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న వర్మ ఇప్పుడు తమన్నా తో లవ్ ఎప్పుడు అంటే ఇప్పటికీ ఓపెన్ అయ్యాడు. మేం మనసులు ఇచ్చుకుంది లస్ట్ స్టోరీస్ -2 లో కాదు. ఓ పార్టీలో కలిసినప్పుడు తమన్నా తో ఎక్కువ సమయం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడుట.
తొలి చూపులో తమన్నా కూడా వర్మ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అటుపై మరో 25 రోజుల తర్వాత రిలేషన్ షిప్ ప్రారంభమైంది` అని తెలిపాడు. అంటే తమన్నాకి మొదట ప్రపోజ్ చేసింది విజయ్ వర్మ అని తెలుస్తోంది. ఆయన మనసిచ్చిన 25 రోజుల తర్వాత తమన్నా కూడా హృదయం అంకితం చేసినట్లు తెలుస్తోంది.