100 ఏళ్ల క్రితం నాటి కథతో..అదో సంచలనం!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా పారంజిత్ దర్శకత్వంలో `తంగలాన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా పారంజిత్ దర్శకత్వంలో `తంగలాన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన విక్రమ్ లుక్, ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ప్రేక్షకుల్ని పా రంజిత్ సరికొత్త వరల్డ్ లోకే తీసుకెళ్ల బోతున్నాడని అర్దమైంది. విక్రమ్ ఆదిమానవుడి గెటప్, భీకర అడవులు, జలపాతాలు లాటి కఠోరమైన లొకేషన్లలో షూట్ చేసిన సన్నివేశాలు హైలైట్ గా కనిపిస్తున్నాయి.
టెక్నికల్ గా సినిమా హై స్టాండర్స్డ్ లో కనిపిస్తుంది. 150 కోట్ట బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈసినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ అందించారు దర్శక, హీరోలు. ఈ కథ ఏకంగా 100 ఏళ్ల క్రితం నాటిదని షాకింగ్ విషయాన్ని విక్రమ్ రివీల్ చేసాడు. `ఎంతో సాహసంతో ఈచిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాలో చిన్నచిన్న సందేశా లుంటాయి. యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ అన్ని ఉన్న చిత్రమిదన్నారు. దేశంలో అణిచివేత, అసమానత్వం ఇంకా ఉన్నాయి.
వాటిని ఎదుర్కునేందుకు నేను సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథకి ఓ చారిత్రాత్మక దృశ్యాన్ని ఇచ్చాం. ఇది బంగారం చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కోసం జరిగే ఓ పోరాటం కూడా. సినిమా అందర్నీ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంతవరకూ ఇలాంటి వరల్డ్ లో ఎవరూ సినిమా చేయలేదు` అని దర్శకుడు అన్నారు.
ఈ వ్యాఖ్యలతో `తంగలాన్` పై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. మరి అంతిమంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందన్నది చూడాలి. విక్రమ్ కి సరైన సోలో హిట్ పడి చాలా కాలమవుతోంది. `స్వామి స్క్వేర్` తర్వాత నటించిన సోలో సినిమాలేవి అంచనాలు అందుకోలేదు. గత సినిమా `పొన్నియన్ సెల్వన్` విజయం సాధించినా ఆ సినిమా క్రెడిట్ అతనొక్కడిదే కాదు. అందులో చాలా మంది హీరోలున్న సంగతి తెలిసిందే.