చేసిన త‌ప్పుకి క్షమాప‌ణ‌లు కోరిన న‌టుడు!

బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరిప్పుడు. 16 ఏళ్ల శ్ర‌మ‌కి `12 త్ ఫెయిల్` సినిమాతో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయాడు.

Update: 2024-02-22 07:03 GMT

బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరిప్పుడు. 16 ఏళ్ల శ్ర‌మ‌కి `12 త్ ఫెయిల్` సినిమాతో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయాడు. అంత‌కు ముందు ఓటీటీ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన న‌టుడు కెరీర్ లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసాడు. కానీ ఒక్క‌స‌క్సెస్ అతడి కెరీర్ నే మార్చేసింది. అయితే అత‌డు ఫేమ‌స్ కాక‌ముందు చేసిన కొన్ని విమ‌ర్శ‌లిప్పుడు ఆయ‌న మెడకు చుట్టుకోవ‌డంతో వాటిపై వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.


తాజాగా ఆయ‌న గ‌తంలో చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇస్తూ క్ష‌మించాల‌ని కోరాడు. ఈసంద‌ర్భంగా విక్రాంత్ మాస్సే త‌న కుటుంబం గురించి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే...`నా అన్న పేరు మోయిన్. నన్ను విక్రాంత్ అంటారు. మరి అతని పేరు మోయిన్ అని ఎందుకంటారు? అంటే అతడు ఇస్లాంలోకి మారాడు కాబ‌ట్టి. నా కుటుంబం దానికి అనుమతి ఇచ్చింది. ఇందులో నీకు సంతృప్తి లభిస్తే అలాగే కానీ అని నా కుటుంబం మా అన్నతో చెప్పింది.

అతడు 17 ఏళ్ల వయసులోనే మతం మారాడు. అది చాలా పెద్ద నిర్ణయం. మా అమ్మ ఓ సిక్కు. మా నాన్న చర్చికి వెళ్లే క్రిస్టియన్. వారానికి రెండుసార్లు చర్చికి వెళ్తాడు. చిన్నతనం నుంచే నేను మతం.. ఆధ్యా త్మికత గురించి ఎన్నో వాదాలను నేను విన్నాను. మా అన్న ఇస్లాంలోకి మారతానంటే ఎలా అనుమతి ఇచ్చావంటూ మా బంధువులు నాన్నను నిలదీశారు. కానీ అది మీకు అనవసరం అని వాళ్లతో చెప్పాడు. అతడు నా కొడుకు.. తనకు ఏం కావాలో ఎంచుకునే హక్కు అతనికి ఉంది అని స్పష్టం చేశాడు.

ఆ తర్వాత నేను మతం గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఇది కేవలం మనిషి సృష్టించిందే అని తెలుసుకున్నాను` అన్నాడు. గ‌తంలో విక్రాంత్ మాస్సే శ్రీరాముడు-సీత‌కి సంబంధించినో కార్టూన్ పోస్ట్ చేసాడు. అప్ప‌ట్లో అది పెద్ద వివాదం అయింది. దానికి విక్రాంత్ క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ` హిందు కులాన్ని కించ ప‌ర‌చ‌డం నా ఉద్దేశం కాదు. కానీ నేను చేసిన ట్వీట్ అలా అర్దం వ‌చ్చేలా ఉండ‌టం న‌న్ను బాధించింది. పేప‌రులో వ‌చ్చిన కార్టూనే నేను పోస్ట్ చేసాను. దాని వ‌ల్ల ఎవ‌రైతే బాధ‌ప‌డ్డారో వారంద‌ర్నీ క్ష‌మాప‌ణ‌లు అడుగుతున్నా. అంద‌రూ త ప్పులు చేస్తారు. ఇప్పుడు నేను చేసాను` అని అన్నాడు.

Tags:    

Similar News