భజన చేసే ట్యాలెంట్ నాలో లేదు!
తాజాగా వినయ్ వర్మ అనే నటుడు ఇదే అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. వినయ్ వర్మ చాలా సినిమాల్లో నటించారు.
ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ట్యాలెంట్ తో పాటు మరో ప్రతిభ కూడా ఉండాలని అంటుంటారు. అదే భజన చేయడం. పరిశ్రమలో ట్యాలెంట్ కంటే కూడా ముఖ్యమైనదిగా దీన్ని కొందరు భావిస్తుంటారు. ఈ భజన అన్నది అన్ని రంగాల్లో ఉన్నదే. అయితే సినీ పరిశ్రమలో మాత్రం ఇంకాస్త ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అక్కడున్న సంఘాల కారణంగానే భజన అనే అంశం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది.
డే బై డే దాని ప్రాధాన్యత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా వినయ్ వర్మ అనే నటుడు ఇదే అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. వినయ్ వర్మ చాలా సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలు చేసారు. అలాగే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ల్లో కూడా నటించారు. ఆయన వాయిస్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే వినయ్ వర్మ అంతగా పాపులర్ కాలేదు. ట్యాలెంట్ ఉన్నా? ఎందుకలా జరిగింది అనే ప్రశ్న ఆయన ముందుకు తీసుకెళ్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'ఇక్కడ అవకాశాలు రావాలంటే టచ్ లో ఉండాలి. గుడ్ మార్నింగ్ లు .. గుడ్ నైట్ మెసేజ్ లు పెట్టాలి. పని ఉన్నా లేకపోయినా కాల్స్ చేస్తూ ఉండాలి. కానీ అలా భజన చేసే టాలెంట్ భగవంతుడు నాకు ఇవ్వలేదు . ఇస్తే బాగానే ఉండేదేమో. ఒకరి సమయాన్ని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందువల్లనే నేను ఎవరికీ కాల్ చేయను. పాత్ర పరంగా సహజత్వానికి దగ్గరగా ఉన్నవి చేయాలనిపిస్తుంది. అలాంటి పాత్రలు చేయడం కష్టం కాబట్టి, నన్ను నేను నిరూపించుకోవాలనిపిస్తుంది.
నేను ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వను . వాళ్లు వినలేదని బాధపడను. నేను కాస్త ముక్కు సూటి మనిషిని. అందువలన నా ధోరణి అందరికీ నచ్చకపోవచ్చు. ముక్కసూటి మనుషులతో వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుగా' అని అన్నారు.వినయ్ వర్మలాగే ట్యాలెంట్ ఉన్న కొంత మంది కూడా భజన ట్యాలెంట్ లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని వాపోయిన వారు ఉన్నారు. సినిమా అవకాశాలు రావాలంటే ప్రతిభతో పాటు రకరకాల ప్యాక్టర్లు పని చేస్తాయన్నారు.