పెర్తు వీధుల్లో విరుష్క జోడీ విహారం!
విరుష్క జోడీ జీవితాన్ని ఆస్వాదించడంలో ది బెస్ట్ అని చెప్పాలి. క్రికెటర్లను పెళ్లాడిన జోడీలు చాలా ఉన్నాయి.
విరుష్క జోడీ జీవితాన్ని ఆస్వాదించడంలో ది బెస్ట్ అని చెప్పాలి. క్రికెటర్లను పెళ్లాడిన జోడీలు చాలా ఉన్నాయి. కానీ వాళ్లందరిలో విరుష్క జోడీ మాత్రం ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది. ఒకరు ఫేమస్ నటి కావడం.. మరొకరు వరల్డ్ వైడ్ ఫేమస్ ప్లేయర్ కావడంతోనే ఇది సాధ్యమైంది. ఆ జంట ఎక్కడికి వెళ్లినా? ప్రపంచంలో కళ్లన్నీ ఆ జోడీని వెంటాడుతూనే ఉంటాయి.
కొంత కాలంగా ఆటగాళ్లతో పాటు వాళ్ల ఫ్యామిలీని కూడా వెంట తీసుకునే వెసులు బాటు బోర్డు కల్పించడంతో? ఎక్కడున్నా ఫ్యామిలీ లైఫ్ ని మాత్రం మిస్ అవ్వడం లేదు. పండగలొచ్చినా.. పబ్బాలొచ్చినా? ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోనే భారతీయ సంప్రదాయం ప్రకారం జరుపుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియోతో సిరీస్ లో భాగంగా భారత జట్లు అసిస్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ లో బిజీ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం భార్యను వెంటేసుకుని పెర్తు వీధుల్లో షికార్లు చేస్తున్నాడు. విరుష్క జోడీ వెంట కుమారుడు అకాయ్ ను కూడా తీసుకుని వెళ్లారు. పెర్త్ వీధుల్లో ఇలా విహారం చేస్తున్నారు. జీన్స్ అండ్ టీషర్ట్ కాంబినేషన్ దుస్తుల్ని అనుష్క ధరించగా..విరాట్ టీషర్ట్ ట్రాక్ లో కనిపిస్తున్నాడు. ఇద్దరు చేతుల్లో శీతల పానీయాలున్నాయి. విరాట్ ఆడే ఏ మ్యాచ్ ను అనుష్క మిస్ అవ్వదు.
ఏ దేశంలో మ్యాచ్ జరిగినా? తప్పక హాజరవుతుంది. దగ్గరుండి భర్తను ప్రోత్సహిస్తుంది. గ్యాలరీలో కూర్చుని ఎంకరేజ్ చేస్తుంది. విరాట్ సిక్స్ కొట్టినా..ఫోర్ కొట్టినా చప్పట్లు కొట్టి కేరితంలు వేస్తుంది. ప్రతిగా విరాట్ ప్లైయింగ్ కిస్సులు విసురుతాడు. ప్రేమికులుగా ప్రయాణం ఎలా మొదలైందో? భార్యాభర్తలైన తర్వాత అదే ప్రయాణాన్ని అంతే ప్రెష్ గా కొనసాగిస్తున్నారు. ఆ రకంగా వాళ్లిద్దరు నవంతరం దంపతులకు ఆదర్శం.