ఆ మీటింగ్‌కి పిలవకున్నా వెళ్తానన్న హీరో..!

తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్‌ ఒక చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ విజయ్ నిర్వహించబోతున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొంటాను అన్నాడు.

Update: 2024-10-21 12:55 GMT

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పార్టీని ఏర్పాటు చేసిన విజయ్‌ త్వరలో జరగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సినిమాలకు విజయ్ స్వస్తి చెప్పబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమా తప్ప మరే సినిమాను కమిట్‌ అవ్వలేదు. ఆ సినిమా తర్వాత విజయ్ నుంచి సినిమాలు ఉండక పోవచ్చు అని అంతా భావిస్తున్నారు. రాజకీయాలతో బిజీ అయ్యే ఆలోచనలో విజయ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా చెన్నైలో భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు గాను విజయ్ సిద్దం అవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ ర్యాలీ పై ఉంది.

కోలీవుడ్‌ నుంచి కొందరు సినీ ప్రముఖులు ఆ ర్యాలీలో పాల్గొంటారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్‌ ఒక చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ విజయ్ నిర్వహించబోతున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొంటాను అన్నాడు. విజయ్ నుంచి ఆహ్వానం రాకున్నా ఆ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటాను అంటూ విశాల్‌ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు ఓటు హక్కు ఉంది. కనుక విజయ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి హామీలు ఇస్తారు అనేది చూడాలని అనుకుంటున్నాను. అందుకే ఆయన ఎన్నికల మొదటి బహిరంగ సభలో పాల్గొనాలని అనుకుంటున్నాను అన్నారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు విజయ్‌ చేయబోతున్న రాజకీయం భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను. టీవీలో సభను చూడటం కంటే నేరుగా వెళ్లి జనాల మధ్యలో ఉండి విజయ్ ప్రసంగం ను వినాలని అనుకుంటున్నాను. ప్రజల మధ్య ఉండి విజయ్‌ మాటలను వినడం ద్వారా వారి అభిప్రాయం కూడా తెలుస్తుందని భావిస్తున్నాను. తప్పకుండా జనాల్లోకి విజయ్ వచ్చినప్పుడు మంచి స్పందన ఉంటుంది. ఆయన మాటలు వినడానికి, ఆయన అజెండా ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి జనాలు బారులు తీరడం ఖాయం. అదే విషయాన్ని స్టార్‌ హీరో విశాల్‌ సైతం చెప్పడం జరిగింది.

అక్టోబర్‌ 27న విల్లుపురంలోని విక్రవండిలో జరగబోతున్న భారీ బహిరంగ సభలో విజయ్ పాల్గొంటారని ఇప్పటికే పార్టీ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇది తమిళగ వెట్రి కళగం పార్టీకి మొదటి బహిరంగ సభ కనుక విజయ్ ఫ్యాన్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఈ సభను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క విజయ్‌ అభిమాని రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు కార్యకర్తల ముందుకు వచ్చిన విజయ్‌ మొదటి సారి బహిరంగ సభ తో రాబోతున్నారు. గతంలో ఎన్నో సార్లు సినిమా వేడుకల్లో పాల్గొన్న విజయ్ ఈసారి రాజకీయ నాయకుడిగా బహిరంగ సభలో పాల్గొనబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 27 సభ పై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News