లెంప‌కాయ లాగితే ఇలాంటి ఆఫ‌ర్లు కూడానా?

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ దిద్లానీ ఆ మ‌హిళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చాడు.

Update: 2024-06-07 20:41 GMT

న‌టి, బిజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ సీఐఎస్ ఎఫ్ మ‌హిళా కానిస్టేబుల్ కుల్వింద‌ర్ కౌర్ చెంప‌దెబ్బ కొట్టిన వీడియో నెట్టింట ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఇప్ప‌టికే ఆ మ‌హిళ స‌స్పెండ్ అయింది. రైతుల ధ‌ర్నాపై కామెంట్స్ కు గానూ లెంప‌కాయ కొట్టిన‌ట్లు కూడా స‌ద‌రు మ‌హిళ వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ విష‌యాన్ని కంగ‌న కూడా అంగీక‌రించింది. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ దిద్లానీ ఆ మ‌హిళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చాడు.

కంగ‌న పై చేయిసుకున్న ఆ మ‌హిళ‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు. ఆ మ‌హిళ‌కు ఉద్యోగం ఇస్తాన‌ని హామీ ఇచ్చాడు. కుల్వింద‌ర్ సింగ్ ఒప్పుకోవాలే గానీ మంచి ఉద్యోగం ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. `హింస‌కు మ‌ద్ద‌తివ్వ‌ను. కానీ ఆమె కోపాన్ని క‌చ్చితంగా అర్దం చేసుకుంటాను. ఆమెను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసినా ఉద్యోగం రెడీగా ఉంది. ఎప్పుడైనా వ‌చ్చి జాయిన్ అవ్వొచ్చు జైజ‌వాన్ ..జైకిసాన్ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చారు.

అలాగే ఏవ‌రైనా మీ మ‌ద‌ర్ 100 రూల‌కు అందుబాటులో ఉంద‌ని కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావ్? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో రైతుల ధ‌ర్నాని ఉద్దేశించి కంగ‌న ర‌నౌత్ 100 రూపాయ‌ల కోసం వ‌చ్చారంటూ కామెంట్ చేసింది. రైతుల్ని అలా కించ‌ప‌రిచినందుకు ఆ కోపంతోనే కుల్వింద‌ర్ సింగ్ చెంప‌దెబ్బ కొట్టింది. ఒక‌ప్పుడు బిల్కిస్ బానో విష‌యంలోనూ కంగ‌న చేసిన పోస్ట్ ను షేర్ చేసారు. ఈ విష‌యంలో కంగ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త కూడా అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మైంది.

రైతు ధ‌ర్నాలంటే అంత చిన్న చూపా? ఇంట్లో మీరు తినే అన్నానికి కార‌ణం ఆ రైతే అంటూ ఏకేసారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మండి నియోజ‌క వ‌ర్గం నుంచి కంగ‌న బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. మొద‌టి ఎన్నిక‌ల్లోనే కంగ‌న గెలుపు గుర్రం ఎక్క‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌లోనే ఈ దాడి అంతే సంచ‌ల‌న‌మైంది.

Tags:    

Similar News