బిగ్ బాస్ 8 : ఫైనల్ ఎపిసోడ్ కి కళామ్మతల్లి ముద్దుబిడ్డ డుమ్మా..?

ఐతే వీరిలో బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న అందరు కంటెస్టెంట్స్ వచ్చారు కానీ కళామ్మతల్లి ముద్దుబిడ్డ అంటూ నాగార్జున చెప్పే యాంకర్ విష్ణు ప్రియ మాత్రం కనిపించలేదు.

Update: 2024-12-15 07:12 GMT

బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కాబోతుంది. ఆల్రెడీ టాప్ 5 లో ఇద్దరిని ఎలిమినేట్ చేశారని తెలుస్తుంది. ఇక ఫైనల్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఈసారి విన్నర్ గురించి లీక్ అవ్వకూడదని చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి సంబందించిన ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఫైనల్ డే కోసం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 మాత్రమే కాదు ఎక్స్ హౌస్ మేట్స్ కూడా అటెంద్ అయ్యారు.

ఐతే వీరిలో బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న అందరు కంటెస్టెంట్స్ వచ్చారు కానీ కళామ్మతల్లి ముద్దుబిడ్డ అంటూ నాగార్జున చెప్పే యాంకర్ విష్ణు ప్రియ మాత్రం కనిపించలేదు. స్టార్ యాంకర్ గా ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన విష్ణు ప్రియ హౌస్ లో పృధ్వితో పులిహోర కలపడం తప్ప పెద్దగా చేసింది ఏమి లేదు. బయట నుంచి వచ్చిన వాళ్లు.. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా పృధ్వి ని వీడలేదు. పృధ్వి ఎలిమినేట్ అయ్యే వారం శ్రీముఖి హౌస్ లోకి వచ్చి కాస్త బ్రెయిన్ వాష్ చేసింది.

అప్పటి నుంచి అతన్ని దూరం పెట్టాలని అనుకుంది. కానీ అప్పటికే ఆ ఎఫెక్ట్ అతని ఆట మీద.. విష్ణు ప్రియ ఆట మీద పడింది. కేవలం హౌస్ లో విష్ణు ప్రియ పృధ్వి కప్పులు కడగడం అతన్ని వెంట పెట్టుకుని ఉండటానికే వచ్చిందా అన్న రేంజ్ లో ఆమె అతి చూపించింది. ఆడియన్స్ కూడా విష్ణు ప్రియ గురించి ఎందుకు ఇలా చేస్తుందని ఫీల్ అయ్యారు. ఇక రెండు వారాల క్రితం బయటకు వచ్చిన విష్ణు ప్రియకు బయట ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.

అంతేకాదు హౌస్ లో తను ఎంతో క్లోజ్ గా ఉన్న పృధ్వి బయటకు వెళ్లాక పట్టించుకోలేదు. సో ఫైనల్ గా అసలు విషయం అర్ధం చేసుకున్న విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లో తన ఆటని విశ్లేషించుకునే ప్రయత్నం చేసింది. అందుకే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ తర్వాత మరో ఇంటర్వ్యూ ఆమె ఇవ్వలేదు. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఐతే బిగ్ బాస్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి ఇన్విటేషన్ వ్చ్చినా కూడా విష్ణు ప్రియ డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది.

మొత్తానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన విష్ణు ప్రియ హోస్ట్ నాగార్జున తనకు ఎంత బూస్టింగ్ ఇచ్చినా ఆమె మాత్రం ఆట పక్కన పెట్టి ఏదో పిక్నిక్ కి వచ్చినట్టుగా పృధ్వితో సరదాగా గడిపింది. బిగ్ బాస్ టాప్ 5 ఉండాల్సిన ఆమె చివరి వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ బాధలోనే విష్ణు ప్రియ ఫైనల్ ఎపిసొడ్ కి రాలేదని అర్థమవుతుంది.

Full View
Tags:    

Similar News