విశ్వక్.. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లేనా?
ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ హైలెట్ చేస్తుంటాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. రెగ్యులర్ కథలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటు వెళుతున్నాడు.
ఇక తనదైన ముద్ర వేసుకుంటున్న ఈ సమయంలో ఓ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే బందూక్ సినిమా విషయంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుందట. ఈ ప్రాజెక్ట్‌ను ఓ కొత్త దర్శకుడితో చేయాలని నిర్ణయించిన సుధాకర్, కథ, కాస్టింగ్ వంటి విషయాల్లో ముందడుగు వేసినప్పటికీ, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సినిమా ముందుకు సాగలేకపోయింది.
విష్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ కోసం మంచి రెమ్యూనరేషన్‌ను అంగీకరించినప్పటికీ, షూటింగ్‌కు సంబంధించి ఫైనల్ డేట్స్ కొన్ని సార్లు మారడం జరిగిందని సమాచారం. దీనికి కారణం కొత్త దర్శకుడిపై ఉన్న అనుమానాలా? లేక మరేదైనా వ్యూహాత్మక నిర్ణయమా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ విశ్వక్, ఈ ప్రాజెక్ట్‌ను పెద్దగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది నిర్మాత సుధాకర్ చెరుకూరికి నిరాశకు గురి చేసింది. మంచి కథకు మంచి హీరోతో కలిసి సినిమా తీయాలని అనుకున్న ఆయన, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను మరో హీరోతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారట. విశ్వక్‌కు ఇది చిన్న షాక్‌గా మారింది. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన కొన్ని కీలక డిస్కషన్లు పూర్తి చేసినప్పటికీ, సినిమాను పూర్తి చేయడం సాధ్యపడలేదు.
ప్రస్తుతం విశ్వక్ సాహు గారపాటి నిర్మాణంలో లైలా అనే చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మరో ప్రాజెక్ట్‌ను కూడా ఆయన చేయాల్సి ఉంది. ఇక ఈ అనుభవాలు విశ్వక్ కు కొత్తేమి కాదు. గతంలో షూటింగ్ పైన ఉన్న సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఆడియెన్స్ కు మంచి కంటెంట్ ఇవ్వడంలో మంచి అనుభవం ఉన్న ఈ హీరో ఫైనల్ గా ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటారు.