సరైన టైమ్ కే విశ్వక్ 'లైలా'.. న్యూ ఇయర్ కు ఫస్ట్ రోజ్..

ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లైలా మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

Update: 2024-12-16 11:39 GMT

టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. విభిన్నమైన కథలతో సినిమాలు చేసే హీరోల్లో మాస్ కా దాస్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. స్క్రిప్ట్ సెలెక్షన్ లో తనదైన ఛాయిస్ తో అలరిస్తుంటారు. వరుస సినిమాలతో తెలుగు సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పిస్తుంటారు విశ్వక్.

2024లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో మెప్పించారు. ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లైలా మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైలాలో విశ్వక్ సేన్ కొంతసేపు అమ్మాయిగా కనిపించనున్నారు. అందుకు సంబంధించిన లుక్ ను ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. కళ్లను మాత్రమే చూపించినా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ భలే క్యూట్ గా ఉన్నారని అంతా ప్రశంసించారు.

ఇప్పటికే వాలెంటైన్స్ డే కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. తాజాగా మరోసారి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రొమాంటిక్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాను ప్రేమికుల దినోత్సవం నాడు రిలీజ్ చేయడం.. సరైన నిర్ణయమనే చెప్పాలి.

అయితే విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో విశ్వక్ సేన్ వేరే లెవెల్ స్టైలిష్ మోడ్ లో ఉన్నారు. ట్రెండీ డ్రెస్, సన్ గ్లాసెస్ ధరించిన ఆయన.. తన షర్ట్ తో ముఖాన్ని మూస్తూ కనిపించారు. ఆయన ఔట్ ఫిట్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. అదే సమయంలో మరో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్.

2025 న్యూ ఇయర్ స్పెషల్ గా లైలా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్) ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అంటే జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ అమ్మాయి రోల్ ఫుల్ లుక్ ను విడుదల చేస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఆకాంక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే సినిమా స్క్రీన్‌ ప్లే బాధ్యతలను వాసుదేవ మూర్తి పర్యవేక్షిస్తుండగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు మేకర్స్ త్వరలో ప్రారంభించనున్నారు. మరి లైలా మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News