పోటీ నుంచి తప్పుకున్నమాస్ కా దాస్.. సోలో రిలీజ్ ఛాన్స్!
సెప్టెంబర్ 7న రావాల్సిన దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ల సినిమా లక్కీ భాస్కర్ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 కి వాయిదా పడింది.
విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 31న మేకానిక్ రాకీ సినిమా విడుదల అవ్వడం లేదనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెకానిక్ రాకీ సినిమాను నవంబర్ 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వారాలనే నిర్ణయానికి విశ్వక్ సేన్ అండ్ టీం వచ్చారని సమాచారం అందుతోంది.
సెప్టెంబర్ 7న రావాల్సిన దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ల సినిమా లక్కీ భాస్కర్ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 కి వాయిదా పడింది. ఒకే రోజు మీనాక్షి చౌదరి నటించిన రెండు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి అనుకుంటున్న సమయంలో మెకానిక్ రాకీ విడుదల వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్ కి తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఉంది, అంతే కాకుండా విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే వీరి కాంబోలో రాబోతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే కచ్చితంగా రెండు సినిమాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించి ఒక సినిమా వాయిదాకు సిద్ధపడింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు లో ఇప్పటికే నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన మహానటి సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ప్రతి మలయాళ సినిమా తెలుగు లో డబ్ అవుతోంది. తాజాగా లక్కీ భాస్కర్ సినిమాను ఆయన తెలుగు లోనే చేయడం జరిగింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు గాను డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. లక్కీ భాస్కర్ తో దుల్కర్ మరో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది.
లక్కీ భాస్కర్ సినిమా కి ఉన్న బజ్ నేపథ్యంలో మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సోలో రిలీజ్ కోసం నవంబర్ 7 కి మాస్ కా దాస్ మెకానిక్ రాకీ విడుదల వాయిదా పడితే కచ్చితంగా కలిసి వచ్చే అంశం అవుతుంది. త్వరలోనే మెకానిక్ రాకీ సినిమా విడుదల తేదీ మార్పు విషయంలో అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు దేనికి అదే అన్నట్లుగా ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కనుక రెండు వేరు వేరు తేదీల్లో రావడం అనేది మంచి నిర్ణయం అనే అభిప్రాయంను సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు.