మాకు కాంపౌండ్‌లు లేవు .. మేమంతా ఒక్కటే: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫలితంతో సంబంధం లేకుండా తన టాలెంట్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫలితంతో సంబంధం లేకుండా తన టాలెంట్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. విశ్వక్ నటించిన లైలా సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి లైలాను నిర్మించాడు.
ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి మీ సినిమా ఈవెంట్లకు ఎక్కువగా నందమూరి హీరోలు గెస్టులుగా వస్తారు, మీరు నందమూరి కాంపౌండ్ అంటూ ఉంటారు. మరిప్పుడు చిరంజీవిని ఎందుకు గెస్టు గా పిలిచారని అడిగారు.
దానికి విశ్వక్ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు. కాంపౌండ్స్ అనేవి మీరు రాసుకుంటారు. మాకు ఉన్నది ఒకటే కాంపౌండ్. అది మా ఇంటి కాంపౌండ్. ఇండస్ట్రీ మొత్తం ఒకటే. బాస్ ఈజ్ బాస్. మేము అభిమానించేవాళ్లు, మా కోసం వచ్చేవాళ్లు ఉన్నారని ప్రతీసారి వాళ్లను ఇబ్బంది పెట్టలేం కదా. సినిమా ఈవెంట్ కు గెస్టుగా పిలవడానికి ఎన్నో కారణాలుంటాయన్నాడు విశ్వక్.
చిరంజీవి గారికి, మా నాన్నకు పాలిటిక్స్ టైమ్ నుంచే పరిచయముందని, ఆ టైమ్ లో మా నాన్న మలక్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడని, చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి చిరంజీవి గారు క్లోజ్ అని విశ్వక్ ఈ సందర్బంగా తెలిపాడు. అనవసరంగా మీరు ఇలాంటి క్రియేట్ చేయకండి. ఇలాంటివి ఎవరైనా అంటే మీడియా లైట్ తీసుకోవాల్సింది పోయి మీరే ఇలా అడిగి దాన్ని పెద్ద ఇష్యూ చేయకండని విశ్వక్ ఈ సందర్భంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు.
విశ్వక్ మాటల్ని బట్టి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా రిలీజైన లైలా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ వచ్చాక ఆ హైప్ మరికొంచెం పెరగడం ఖాయం.