ఎంతైనా విశ్వక్ తోపే..

ఫలక్ నామా దాస్ నుంచి ఇప్పుడు గామి వరకు.. ప్రతీ సినిమా కూడా ఓ ప్రయోగమే అని చెప్పవచ్చు.

Update: 2024-03-09 05:51 GMT

టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ రూటే వేరు. మిగతా యంగ్ హీరోల మాదిరి కాకుండా సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు. కేవలం హీరోగానేే కాకుండా.. రచన, దర్శక నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కంటిన్యూగా షూటింగ్స్ లో పాల్గొంటూ సత్తా చాటుతున్నారు మన మాస్ కా దాస్.

శివరాత్రి కానుకగా తాజాగా గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాలుగేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. నిన్ననే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. మానవ స్పర్శ తట్టుకోలేని అఘోర శంకర్ పాత్రలో కనిపించి అందరినీ షాక్ కు గురి చేశారు. తన నటనతో అదరగొట్టారు. మొత్తానికి ప్రతీ చిత్రంలో వేరియేషన్ చూపిస్తున్నారు విశ్వక్. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే మిగతా యంగ్ హీరోల్లా కాకుండా ఎక్కువ ప్రయోగాలు చేస్తుండడంతో.. విశ్వక్ మార్కెట్ ఎలా ఉన్నా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వెళుతున్నాడు. విశ్వక్ సేన్ ఏమాత్రం తగ్గకుండా తగ్గేదేలే అన్నట్లు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఫలక్ నామా దాస్ నుంచి ఇప్పుడు గామి వరకు.. ప్రతీ సినిమా కూడా ఓ ప్రయోగమే అని చెప్పవచ్చు. ఫలితాలు పక్కన పెడితే.. కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న విశ్వక్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.

ఇక విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ.. మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్ కానుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. శివరాత్రి కానుకగా మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన పోస్టర్.. మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఊర మాస్ లుక్ లో మీసం మెలేస్తూ విశ్వక్ తన గ్యాంగ్ తో యుద్ధానికి సిద్ధం అన్నట్లు కనిపిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు విశ్వక్ లైనప్ లో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి లైలా. ఈ మూవీకి ఓ హైదరాబాదీ దర్శకత్వం వహించనున్నారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో లైలా పాత్రను విశ్వకే పోషిస్తున్నారు. సెకండాఫ్ లో ఎక్కువ సమయం.. విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నారు. మరోవైపు, ఇంకో చిత్రం కల్ట్ కు స్టోరీ అందించి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి విశ్వక్ వరుస ప్రయోగాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

Tags:    

Similar News