విశ్వక్ ఈసారి మరింత ఫోకస్ గా..!
యువ హీరోల్లో సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ సత్తా చాటుతున్న విశ్వక్ సేన్ రాబోతున్న సినిమాలతో కూడా తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ఈ ఇయర్ మార్చిలో గామితో వచ్చిన విశ్వక్ సేన్ లాస్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో వచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విశ్వక్ సేన్ మాస్ యాంగిల్ ని కొత్తగా చూపించేలా చేశారు. సినిమా కూడా ఆడియన్స్ ని మెప్పించింది. ఐతే యువ హీరోలంతా కూడా 100 కోట్ల సినిమాలతో అదరగొడుతున్న సందర్భంగా విశ్వక్ సేన్ కూడా నెక్స్ట్ సినిమా టార్గెట్ 100 కోట్లు పెట్టుకున్నాడు. అందుకోసం తను చేస్తున్న సినిమాలకు మరింత ఫోకస్ తో పనిచేస్తున్నాడు.
విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో పాటుగా లైలా అనే సినిమా కూడా చేస్తున్నాడు. మెకానిక్ రాకీ సినిమా రవితేజ ముల్లపూడి డైరెక్ట్ చేస్తుండగా.. లైలా సినిమాను రామ్ నారాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లే తో వస్తున్నాయని తెలుస్తుంది. విశ్వక్ సేన్ ఈ రెండు ప్రాజెక్ట్ ల మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మెకానిక్ రాకీ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉండగా లైలాని ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లారని తెలుస్తుంది. యువ హీరోల్లో సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ సత్తా చాటుతున్న విశ్వక్ సేన్ రాబోతున్న సినిమాలతో కూడా తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు. ఐతే ఈసారి టార్గెట్ ని భారీగా ఫిక్స్ చేసుకుని అందుకు తగినట్టుగానే వర్క్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది. టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ గా అవతరించే క్వాలిటీస్ అన్నీ ఉన్న విశ్వక్ సేన్ కథల ఎంపికలో ఇంకాస్త ఫోకస్ చేస్తే మాత్రం నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఫలితాలను అందుకుంటాడు. మరి విశ్వక్ సేన్ కలను నిజం చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా తన ఫుల్ ఎఫర్ట్స్ తో ది బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు విశ్వక్ సేన్. మాస్ కా దాస్ ఫ్యాన్స్ కు రానున్న సినిమాలతో మాస్ ఫీస్ట్ అందించడానికి విశ్వక్ సేన్ సిద్ధం అవుతున్నాడని చెప్పొచ్చు.