అంత కష్టపడి జీరో రెమ్యూనరేషన్‌ అంటే నమ్ముతారా..?

ఈ మధ్య కాలంలో హీరోల పారితోషికం భారీగా పెరిగింది. స్టార్‌ హీరోలు కాస్త అటు ఇటుగా వంద కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు

Update: 2024-03-03 06:50 GMT

ఈ మధ్య కాలంలో హీరోల పారితోషికం భారీగా పెరిగింది. స్టార్‌ హీరోలు కాస్త అటు ఇటుగా వంద కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా పది నుంచి పాతిక వరకు డిమాండ్ చేస్తున్నారని టాక్. కొందరు హీరోలు మొదట మినిమం పారితోషికం తీసుకుని ఆ తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటూ ఉన్నారు.

అయితే యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ మాత్రం జీరో రెమ్యూనరేషన్‌ అంటూ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తాజా చిత్రం గామి కోసం ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదు అంటూ తాజా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. విశ్వక్‌ సేన్‌ ప్రకటన పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల గామి సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయ్యింది. అత్యంత కష్టమైన లొకేషన్స్‌ లో షూటింగ్‌ చేశారు. యంగ్‌ హీరోలు అస్సలు అంగీకరించని అఘోరా పాత్ర లో విశ్వక్‌ సేన్ నటించాడు. అంతగా కష్టపడ్డ విశ్వక్‌ సేన్‌ పారితోషికం లేకుండా నటించాడు అంటే.. కంటెంట్‌ పై నమ్మకంతో లాభాల్లో వాటాకు ఒప్పుకుని ఉంటాడు అనేది కొందరు అభిప్రాయం.

విద్యాధర్ కగిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే భారీగా ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాకు హీరో పారితోషికం తీసుకోక పోవడం అనేది కాస్త ఊరట కలిగించే విషయం. హీరో పారితోషికం కూడా మేకింగ్‌ కు పెట్టి ఉంటారు. బిజినెస్‌ సమయంలో హీరో కి కొంత ఇచ్చి ఉంటారు అనేది కొందరి టాక్‌.

మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రత లో షూటింగ్‌ చేయడం తో పాటు చాలా రోజుల పాటు నిజమైన అఘోరాలు మరియు సాధువులతో హీరో విశ్వక్‌ సేన్‌ ఉన్నాడట. షూటింగ్‌ ప్రారంభం కు 15 రోజుల ముందు నుంచే విశ్వక్‌ సేన్‌ తన ప్రిపరేషన్‌ ప్రారంభించి అద్భుతమైన లుక్ కి వచ్చాడట. విభిన్నమైన సినిమా గా రూపొందిన గామికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Tags:    

Similar News