ఆరేళ్ల కష్టానికి దక్కిన ఫలితమే ఇది!

ట్రైలర్ తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన విశ్వక్ చిత్రానికి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే 9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది

Update: 2024-03-09 17:47 GMT

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ డ్రామా 'గామి'. నూతన దర్శకుడు విద్యాధర్ కగిత తెరకెక్కించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్ తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన విశ్వక్ చిత్రానికి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే 9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

కొత్తదనం నిండిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు 'గామి' విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై చెప్పని కథతో, ఎన్నడూ చూడని అధ్బుతమైన విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా.. ఆడియెన్స్ ను డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. మునుపెన్నడూ కలగని సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఆరేళ్ల కష్టం తెర మీద కనిపిస్తోంది.

'గామి' అనేది యునిక్ స్టోరీ లైన్ తో, విభిన్నమైన స్క్రీన్‌ ప్లేతో రూపొందిన చిత్రం. దర్శకుడు కథను ఆరంభించిన తీరు, దాన్ని మూడు కథలుగా సమాంతరంగా నడిపించిన విధానం ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్‌ తన ఛాయాగ్రహణంతో సినిమాకు ప్రాణం పోశారు. నరేష్‌ కుమారన్‌ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

క్రౌడ్ ఫండింగ్ తో సినిమా అంటే, ఎవరైనా సింపుల్ గా మామూలు లొకేషన్లలో చిత్రీకరించి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమాని అందుకు పూర్తి భిన్నంగా తెరకెక్కించారు. మంచు పర్వతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. 'శివం' పాటను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఖరీదైన కెమెరా సెటప్‌లు, లైటింగ్ పరికరాలు, విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్‌లను ఉపయోగించనప్పటికీ.. మేకర్స్ బిగ్ స్క్రీన్ మీద ఒక విజువల్ వండర్ ను ఆవిష్కరించడానికి అతి పెద్ద సాహసం చేశారనే విషయం అర్థమవుతుంది.

నెమ్మదిగా సాగే కథనం, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ.. లిమిటెడ్ బడ్జెట్ లో హలీవుడ్ స్టాండర్డ్స్ లో అందించిన విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇవే ఇప్పుడు 'గామి'కి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. శనివారం ఉదయానికి నార్త్ అమెరికాలో 300K డాలర్లు క్రాస్ చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News